Krishna Flood Bank Widening Works: కృష్ణా నది కరకట్ట పనులకు సీఎం జగన్ శంకుస్థాపన, కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర విస్తరణ పనులు, కరకట్ట పనుల కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేయనున్న ఏపీ ప్రభుత్వం

విజయవాడ దుర్గమ్మ చెంతన ప్రకాశం బ్యారేజి వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం (Kondaveeti Vagu lift irrigation scheme) నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర కుడివైపు కృష్ణా నది కరకట్ట పనులకు (Krishna Flood Bank Widening Works) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan reddy)బుధవారం శంకుస్థాపన చేశారు.

Krishna Flood Bank Widening Works (Photo-Twitter)

Amaravati, June 30: విజయవాడ దుర్గమ్మ చెంతన ప్రకాశం బ్యారేజి వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం (Kondaveeti Vagu lift irrigation scheme) నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర కుడివైపు కృష్ణా నది కరకట్ట పనులకు (Krishna Flood Bank Widening Works) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan reddy)బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కరకట్ట విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం (AP Govt) రూ. 150 కోట్లు ఖర్చు చేయనుంది. అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విస్తరణ పనులు జరగనున్నాయి.

10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితో పాటు ఇరువైపులా రెండు వరుసల నడకదారులను విస్తరణలో భాగంగా నిర్మించనున్నారు. ఈ రహదారితో అమరావతిలోని ఎన్‌-1 నుంచి ఎన్‌-3 రోడ్లను అలాగే ఉండవల్లి- రాయపూడి- అమరావతి సీడ్‌ యాక్సిస్‌ రోడ్, గొల్లపూడి- చిన్నకాకాని- విజయవాడ బైపాస్‌ రోడ్లకు అనుసంధానమవుతుంది.

దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు, గొల్లపూడిలో దిశ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం వైయస్ జగన్, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని పిలుపు

కరకట్ట రహదారి నిర్మాణం ద్వారా అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

Here's Krishna flood bank widening works Foundation stone Video

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్‌ యాదవ్, బొత్స సత్యనారాయణ, సూచరిత, రంగనాధ రాజు, నారాయణ స్వామి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ వివేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now