Kadapa Steel Plant Bhumi Puja: దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీ, కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ,ఏపీ ముఖ్యమంత్రి స్పీచ్ హైలెట్స్ ఇవే..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉందన్నారు.

Kadapa Steel Plant Bhumi Puja (Photo-Video Grab)

YSR Kadapa, Feb 15: జేఎస్‌డబ్ల్యు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ సమక్షంలో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ (Kadapa Steel Plant Bhumi Puja) చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉందన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీ (Andhra Pradesh) అని సీఎం పేర్కొన్నారు.ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

దేవుడి దయతో వైఎస్సార్‌ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్‌ (CM YS Jagan) అన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయామన్నారు. ఎప్పట్నుంచో కలలుగన్న స్వప్నం ఈ స్టీల్‌ప్లాంట్‌. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌ కలలుగన్నారు. వైఎస్సార్‌ మరణంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు.

ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన సీఎం జగన్, 3,591.65 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు

రూ.8,800 కోట్లతో 3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి అవుతుంది. స్టీల్‌ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాంట్‌ రావడం కోసం కష్టాపడాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి. స్టీల్‌ ప్లాంట్‌వస్తే ఈ ప్రాంతం స్టీల్‌ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుంది. గండికోట రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేక పైపులైన్‌ ద్వారా నీటి సరఫరా అవుతుంది. తొలి విడతలో రూ. 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది’’ అని సీఎం జగన్‌ అన్నారు.

ఏపీలో త్వరలో దాదాపు 90,000 మందికి ఉద్యోగావకాశాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో ఐటీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి

‘‘రూ.700 కోట్లతో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నాం. 30 నెలల్లోపు స్టీల్‌ప్లాంట్‌ తొలి దశ పూర్తవుతుంది. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నాం. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతో చుట్టుపక్క అనుబంధాల రంగాలు అభివృద్ధి చెందుతాయి. చదువుకున్న మన పిల్లలకు మన ప్రాంతంలో ఉపాధి లభిస్తుంది. 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం కూడా తెచ్చాం’’ అని సీఎం జగన్‌ అన్నారు.

సీఎం జగన్‌పై సజ్జన్‌ జిందాల్‌ ఏమన్నారంటే..

మహానేత వైఎస్సార్‌ తనకు మంచి మిత్రులు, గురువు అని జేఎస్‌డబ్ల్యు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ అన్నారు. బుధవారం ఆయన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో స్టీల్‌ప్లాంట్‌ భూమిపూజ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం జగన్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉందన్నారు. మహానేత వైఎస్సార్‌ చూపిన బాటలోనే సీఎం జగన్‌ నడుస్తున్నారని అన్నారు.

‘‘రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ స్టీల్‌ ప్లాంట్‌ కడప ప్రజల చిరకాల స్వప్నం. వైఎస్‌ జగన్‌ కృషి, పట్టుదల కారణంగానే ఈ కల సాకారమవుతోంది. ఇది వైఎస్సార్‌ జిల్లా. మహానేత వైఎస్సార్‌ని స్మరించుకోకుంటే ఈ కార్యక్రమం అసంపూర్తిగానే మిగిలిపోతుంది’’ అని సజ్జన్‌ జిందాల్‌ వ్యాఖ్యానించారు.

‘‘నేను వైఎస్సార్‌ను కలిసినప్పుడు వైఎస్‌ జగన్‌ యువకుడు. ఆయన్ను ముంబై తీసుకెళ్లి వ్యాపార సూత్రాలు నేర్పించాలని వైఎస్సార్‌ చెప్పారు. 15-17 ఏళ్ల క్రితం జగన్‌ ముంబైలోని నా ఆఫీస్‌కు కూడా వచ్చారు. ఏపీని సీఎం జగన్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రజా సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా జగన్‌ భావిస్తున్నారు. విజయవాడలో సీఎంతో కలిసి లంచ్‌ చేసినప్పుడు రాష్ట్రం గురించి చాలా మాట్లాడుకున్నాం.

వైద్య ఆరోగ్య రంగం నుంచి డిజిటలైజేషన్‌ వరకూ ఆయన మాటలు నాకు దేవుడి మాటల్లా అనిపించాయి. నాకు తెలుగు మాట్లాడటం రాదు.. లేదంటే.. నేను చెప్పే విషయాలు మీకు పూర్తిగా అర్థమయ్యేవి. సీఎం జగన్‌ లాంటి యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది’’అని సజ్జన్‌ జిందాల్‌ పేర్కొన్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టించారని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిపై కొందరు కుయుక్తులు పన్నారన్నారు. వైఎస్సార్‌ కన్న కలను సీఎం జగన్‌ నెరవేర్చారని, వైఎస్సార్‌ జిల్లా కూడా ఉక్కు నగరంగా మారబోతుందని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు.

రాయలసీమ ప్రజల కల సాకారమవుతోందని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను జగనన్న ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. వేల మందికి ఉపాధి దొరుకుతుండటం గర్వంగా ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగనుందని, స్టీల్‌ ప్లాంట్‌ ద్వారా జిల్లా ముఖచిత్రం మారబోతుందని అవినాష్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర చరిత్రలోనే ఈ రోజు శుభదినమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్‌ కృషితో జిల్లా ప్రజల కల నెరవేరుతుందన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif