AP CM Meets Governor: ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఎం, ఎన్నికలు జరిపేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని విన్నపం, సీఎం వైయస్ జగన్‌పై చంద్రబాబు ఘాటు విమర్శలు
అధికార పార్టీ (YSRCP), ప్రతిపక్ష పార్టీల (TDP) మధ్య దీనిపై వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో (Biswabhushan Harichandan) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Amaravati, Mar 16: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా (Local Body Elections postponed) వేస్తున్నామని ఏపీ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ (SEC Ramesh Kumar) ప్రకటించిన నేపథ్యంలో ఇది రాజకీయ వేడిని రాజేస్తోంది. అధికార పార్టీ (YSRCP), ప్రతిపక్ష పార్టీల (TDP) మధ్య దీనిపై వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో (Biswabhushan Harichandan) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కరోనా వైరస్ సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికలను వాయిదా వేయాల్సినంతటి తీవ్ర పరిస్థితి లేదని వివరించారు. కనీసం సీఎస్, వైద్య, ఆరోగ్య శాఖకార్యదర్శులను సంప్రదించకుండానే ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నారని వెల్లడించారు. మార్చి 31లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.5 వేల కోట్లు రాష్ట్రానికి రాకుండాపోయే ప్రమాదం ఉందని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను పిలిపించి, ఈ అంశంపై మాట్లాడి, వెంటనే ఎన్నికలు నిర్వహించేలా చూడాలని గవర్నర్‌ను సీఎం కోరారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
తెలంగాణాలో విద్యాసంస్థలు, మాల్స్, థియేటర్లు అన్నీ బంద్
ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉద్దేశపూర్వక చర్యలను అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం వల్ల రాష్ట్రానికి నష్టం తప్పదని ప్రభుత్వం భావిస్తోంది.
ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ ఫైర్
ఎన్నికలను వాయిదా వేయడాన్ని సీఎం జగన్ తప్పుపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రెస్ మీట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసీ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయారని, ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేశ్‌కుమార్, చంద్రబాబుది ఒకే సామాజికవర్గం అన్న జగన్.. చంద్రబాబు హయాంలోనే రమేష్ కుమార్ నియమితులయ్యారని గుర్తు చేశారు.
టీటీడీ సంచలన నిర్ణయం, భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిష్పాక్షికంగా ప్రవర్తించడం లేదన్నారు జగన్. కరోనా వైరస్ సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఈసీ రమేశ్‌కుమార్.. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల బదిలీకి ఆదేశాలు ఇవ్వడాన్ని జగన్ తప్పుపట్టారు.
AP CM Meets Governor
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఎక్కడుందని జగన్ నిలదీశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే భయంతోనే విచక్షణ అధికారాల పేరుతో ఎన్నికలు వాయిదా వేశారని సీఎం జగన్ ఆరోపించారు.
విచక్షణ అధికారాల పేరుతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంటే తాము అధికారంలో ఉండి ఉపయోగం ఏంటని జగన్ ప్రశ్నించారు. ఇక సీఎంగా నేనెందుకు అని జగన్ నిలదీశారు. ఎన్నికల కమిషనరే సీఎంగా పని చేయొచ్చు కదా? అన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్నికలు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు అని అడిగారు.
విచక్షణాధికారం పేరుతో ఎన్నికలు వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఈసీకి ఎక్కడ ఉందని జగన్ ప్రశ్నించారు. ఎవరినీ సంప్రదించకుండానే, ఎవరి సలహాలు తీసుకోకుండానే రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని జగన్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు కోసమే ఈసీ ఎన్నికలు వాయిదా వేశారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ ఆరోపణలపై ఈసీ రమేశ్ కుమార్ ప్రకటన
ఏపీ సీఎం జగన్ ఆరోపణలపై ఈసీ రమేశ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనాపై జాతీయస్థాయిలో హెచ్చరికలు, సంప్రదింపుల తర్వాతే ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. కరోనా ఎఫెక్ట్ తగ్గితే..ఆరు వారాలు లేదా అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగ సంస్థగా తెలిపారు. హైకోర్టు జడ్జీకి ఉండే అధికారాలు స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు ఉంటుందని స్పష్టం చేశారు.ఏ పార్టీకి లబ్ది చేకూర్చకుండా..ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని, ఇళ్ల పట్టాల పంపిణీ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తుందని తెలిపారు.
ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి జరిగిన పలు హింసాత్మక ఘటనలను ఈసీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీ ఎలక్షన్ కమిషనర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. పలు చోట్ల ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీకి మద్దతుగా నిలిచారని ఫిర్యాదులు అందాయని, ముఖ్యంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపించిందని, వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతమున్న కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో వేరొకరిని నియమించాలని ఆయన అన్నారు.
సీఎం మీద మండి పడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని సీఎం జగన్ అనడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. పారాసిటమాల్ వేస్తే కరోనా తగ్గిపోతుందని సీఎం జగన్ అనడం దారుణం అన్నారు. కనీస జ్ఞానం లేకుండా కరోనాపై జగన్ మాట్లాడుతున్నారని, సీఎం జగన్ కు విషయ పరిజ్ఞానం లేకపోవడం దురదృష్టకరమని చంద్రబాబు వాపోయారు.
Here's CM YS Jagan comments
కరోనాపై మాట్లాడిన మాటలను జగన్ వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ఏ విధమైన అవగాహన లేకుండా జగన్ ఎన్నికలకు వెళ్లారని చంద్రబాబు మండిపడ్డారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిలో ఒక్కరికి కరోనా ఉన్నా పోలింగ్ కు వచ్చిన వారందరికి కరోనా సోకుతుందని చంద్రబాబు హెచ్చరించారు.
మాట్లాడితే 151 సీట్లు వచ్చాయని జగన్ చెప్పుకోవడం కరెక్ట్ కాదన్నారు. సామాజిక వర్గం పేరు పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సరికాదన్నారు. మీరు ఈసీని బెదిరిస్తారా? అని చంద్రబాబు సీరియస్ అయ్యారు. జగన్ పులివెందుల మార్క్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. అరాచకాలు చేస్తూ చిన్న గొడవలు జరిగాయని చెప్పుకుంటున్నారని ఆగ్రహించారు.
ప్రజల ప్రాణాలకంటే మీకు ఎన్నికలు ముఖ్యమా? రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? అని జగన్ ను ప్రశ్నించారు. కరోనా వైరస్ పై ముఖ్యమంత్రిగా మొదటి మీడియా సమావేశం నిర్వహించి జగన్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు. కరోనాను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 5వేల 500మంది కరోనాతో చనిపోయారని చంద్రబాబు చెప్పారు.
కరోనాకు మందు కూడా లేదన్నారు. కరోనా ప్రబలితే ఆసుపత్రులు లేవు, మందులూ లేవన్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉంటే, కరోనా వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, 60ఏళ్లు పైబడిన వారికే కరోనా వస్తుందని, పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుందని సీఎం జగన్ అనడం దారుణం అని చంద్రబాబు అన్నారు. జగన్ తెలివి తక్కువ తనానికి ఇదే నిదర్శనం అన్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు జగన్ లేదన్నారు .
ఏకగ్రీవ స్థానాలపై స్పష్టత
రాష్ట్రంలో 126 జెడ్పీటీసీ, 2,406 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా వెల్లడించింది. ఇక 526 జెడ్పీటీసీ స్థానాలు, 7,287 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉందని పేర్కొంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏకగ్రీవాలు పోను ఇక ఎన్నికలు జరగాల్సిన స్థానాలపై ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది.