File image of Telangana CM KCR | File Photo

Hyderabad, Mar 14: తెలంగాణా రాష్ట్రంలో (Telangana State) కరోనా వైరస్‌ విస్తరిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు (School Holidays) ప్రకటించింది. ఈ మేరకు కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు.

దిల్లీలో కరోనావైరస్ సెలవులు

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించాలని ఈ మీటింగ్ లో (KCR Review Meeting On COVID-19) నిర్ణయించారు. ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయనున్నారు. మరో నాలుగు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు ముగియనున్నాయి.

కరోనా వైరస్‌ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తిని ( Coronavirus) అరికట్టడంలో భాగంగా ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్‌, మాల్స్‌ను కూడా మూసివేయాలని సీఎం ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా రేపు, ఎల్లుండి కూడా శాసనసభ సమావేశాలు జరగనున్నాయి.

పరారైన కరోనా అనుమానితులు

తెలంగాణలో (Telanagana) ఇప్పటికే రెండు కరోనా కేసులు పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. గాంధీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య కేంద్రాల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. వైరస్‌ లక్షణాలు కనిపించిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు చేపడుతోంది.

ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందడం కలకలం రేపింది.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అ‍య్యింది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల వద్దనే పరీక్షలు నిర్వహిస్తోంది.

కరోనావైరస్‌(COVID-19))ను ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శనివారం శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. అవసరమైతే రూ.1000 కోట్లు కాదు రూ.5000 కోట్లు ఖర్చు చేసైనా కరోనాను కట్టడి చేస్తామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదు

కరోనా కోసం సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. డీసీపీ ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన కమిటీని పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో 200 మంది స్క్రీనింగ్‌ చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్‌ సోకగా ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారని సీఎం తెలిపారు. 65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్‌ వల్ల కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని కేసీఆర్‌ పేర్కొన్నారు.