Delhi, March 12: భారతదేశంలో కరోనావైరస్ యొక్క పాజిటివ్ కేసులు (Coronavirus in India) విజృంభిస్తున్న నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనావైరస్ ను విస్తృతంగా ప్రబలే అంటువ్యాధిగా ప్రకటించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని దిల్లీలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించారు. అయితే ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన పరీక్షలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
గుంపులకు దూరంగా ఉండాలని దిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సూచించారు. అంతేకాకుండా ఈనెల చివరి వరకు సినిమా హాళ్లు కూడా మూసివేయబడతాయని అయన తెలియజేశారు.
దిల్లీలోని అన్ని బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ ఇతరత్రా అన్ని ప్రదేశాలలో తప్పనిసరిగా 'శుద్ధి' కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు.
CM Kejriwal Statement:
Delhi govt has declared Coronavirus an epidemic. We need to exercise abundant caution to contain the disease. All cinema halls, schools, colleges in Delhi will be shut until 31st March, but exams will continue as scheduled. People are advised to stay away from public gatherings. pic.twitter.com/2vHyinNKAP
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 12, 2020
దేశరాజధాని దిల్లీలో గురువారం నాటికి 6 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 73 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి. కేరళలో అత్యధికంగా 17 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాలు రద్దు చేసిన భారత్
గతేడాది డిసెంబర్ నెలలో చైనా దేశంలోని వుహాన్ నగరంలో తొలి కరోనావైరస్ కేసు నమోదైంది. అది క్రమంగా విస్తరించి నేడు ప్రపంచంలోని 100కు పైగా దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 117,330 మంది ఈ వైరస్ బారిన పడగా, 4200 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ను 'ప్రపంచ అంటువ్యాధి'గా ప్రకటించింది.