AP Coronavirus: ఏపీలో కరోనాపై భారీ ఊరట, కేవలం 49,513 కేసులు మాత్రమే యాక్టివ్, 6,78,828కు పెరిగిన డిశ్చార్జ్ కేసుల సంఖ్య, తాజాగా 5,120 మందికి కోవిడ్-19 పాజిటివ్
5,120 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా (AP Coronavirus Update) తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,34,427 కి చేరింది. కరోనా నుంచి ఇవాళ కొత్తగా 6,349 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,78, 828గా ఉంది.
Amaravati, Oct 07: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 66,769 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 5,120 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా (AP Coronavirus Update) తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,34,427 కి చేరింది. కరోనా నుంచి ఇవాళ కొత్తగా 6,349 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,78, 828గా ఉంది.
కాగా కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా 34మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6086కి (Covid Deaths) పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 49,513 యాక్టివ్ కేసులు (Active COVID-19 cases) ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 62,83,009 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 72,049 పాజిటివ్ కేసులు (India Coronavirus), 986 మరణాలు నమోదయ్యాయి. మొత్తం 82,203 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది.
దేశంలో ఇప్పటివరకు 67,57,132 పాజిటివ్ కేసులు నమోదవగా యాక్టివ్ కేసులు 9,07,883. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 57,44,693. ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి మొత్తం 1,04,555 మంది మృతి ( Death Toll Mounts to 1,04,555) చెందారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 85.02 శాతంగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 13.44. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,22,71,654 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.