Curfew Relaxation in AP: ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు, జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు అమల్లోకి, మిగతా మూడు జిల్లాల్లో యథావిధిగా కొనసాగనున్న కర్ఫ్యూ

అయితే రాష్ట్రం మొత్తం కాకుండా కరోనావైరస్ పాజిటివిటీ రేటు ఆధారంగా సడలిపులపై (Curfew Relaxation in AP) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు (Curfew Relaxation) సడలించారు.

Curfew (Photo-PTI)

Amaravati, June 28: ఏపీలో కోవిడ్‌ కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా కరోనావైరస్ పాజిటివిటీ రేటు ఆధారంగా సడలిపులపై (Curfew Relaxation in AP) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు (Curfew Relaxation) సడలించారు. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉండనుంది.

రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత కొనసాగుతుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది. కొవిడ్‌ పాజిటివిటీ 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ సడలింపు ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

సడలింపు జిల్లాలు: అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం.

రేపు గొల్లపూడికి సీఎం వైయస్ జగన్, దిశ యాప్‌‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి, ప్రతి మహిళా దిశ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రభుత్వం కార్యాచరణ

ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు ఉంటుంది. ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తిస్తాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో పూర్తి సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకోకున్నారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు