IPL Auction 2025 Live

Andhra Pradesh Elections 2024: జగన్ భూములు ఇచ్చేవాడే కానీ లాగేసుకునేవాడు కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై వివరణ ఇచ్చిన సీఎం జగన్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

Cm Jagan (Photo-Video Grab)

Anakapalle, May 2: ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నామని వివరించారు. కానీ, చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. జగన్ క్యారెక్టర్ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, జగన్ భూములు ఇచ్చేవాడే కానీ, భూములు లాగేసుకునేవాడు కాదని స్పష్టం చేశారు.

అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా?. మీ భూముల మీద మీకు సర్వహక్కులూ కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశ్యం. వందేళ్ల కిందట బ్రిటీష్ వారి పాలనలో భూ సర్వే జరిగింది. ఆ తర్వాత మరోసారి భూ సర్వే నిర్వహించలేదు. సమగ్ర సర్వే లేకపోవడంతో భూముల సబ్ డివిజన్ జరగలేదు... భూముల కొలతలు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తమ భూములను అమ్ముకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడమే కాదు, కొన్నిసార్లు కోర్టులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రజలకు డబ్బులు కూడా ఖర్చవుతున్నాయి. ఈ పరిస్థితి మారాలన్న ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించాం. జగన్‌కు అండగా నిలవండి, ఏపీ ముస్లిం ఓటర్లను కోరిన అసదుద్దీన్ ఒవైసీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లకు చరమగీతమే..

భూమి మీద సొంతదారుకు సంపూర్ణ హక్కు ఇవ్వాలన్నదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యం. భూములకు హద్దులు నిర్ణయించి, రికార్డును నవీకరించి, ఆ వివరాలతో రిజిస్ట్రేషన్లు చేసి మళ్లీ రైతులకు అందించే కార్యక్రమం జరుగుతుంటే... చేతనైతే మద్దతు పలకాలి కానీ, దుష్ప్రచారం చేయడం తగదు" అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

‘‘పేదలకు, బాబు మోసాలకు మధ్య జరిగే యుద్ధం ఇది. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది, విలువలకు, విశ్వసనీయతకు ఓటేయడానికి మీరంతా సిద్ధమేనా?. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే. ఎన్నికల్లో మీరు వేసే ఓటే పేదల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక పాలన చేయడంతో చంద్రబాబుకు మన మీద పిచ్చి కోపం వస్తోంది. మీ జగన్‌ మంచి చేశాడని చంద్రబాబుకు కోపమొస్తుంది’’ అని సీఎం జగన్‌ ధ్వజమెత్తారు

‘‘అవ్వాతాతలకు ఇంటివద్దే పెన్షన్‌ ఇవ్వడం విప్లవం అవునా?కాదా?. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం విప్లవాత్మక మార్పు. ఉన్నత చదువుల కోసం విద్యాదీవెన, వసతి దీవెన.. పిల్లలను బడులకు పంపే తల్లులకు అమ్మఒడి పథకం.. అక్కా చెల్లెమ్మల కోసం ఆసరా, చేయూత, సున్నావడ్డీ.. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్‌.. మహిళల రక్షణ కోసం దిశా యాప్‌ తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘రైతన్నకు తోడుగా పెట్టుబడి సాయం విప్లవాత్మక మార్పు. పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ విప్లవాత్మక మార్పు. సకాలంలోనే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ విలేజ్‌ క్లినిక్‌ విప్లవాత్మక మార్పు. ఫ్యామిలీ డాక్టర్‌ విప్లవాత్మక మార్పు. పేషెంట్‌ విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం విప్లవాత్మక సాయం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు. వాలంటీర్‌ వ్యవస్థతో పౌర సేవలందిస్తున్నాం’’ అని సీఎం చెప్పారు

‘‘రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేయడం ఓ విప్లవం. అబద్ధాలు, మోసాలకు చంద్రబాబు రెక్కలు కడుతున్నాడు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. పేదల పక్షాన మీ బిడ్డ జగన్‌ నిలబడ్డాడు. చంద్రబాబు పక్షాన దత్తపుత్రుడు, ఎల్లో మీడియా, కుట్రలు.. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో పెన్షన్‌ను అడ్డుకున్నాడు. 14 ఏళ్లలో బాబు ఏనాడూ అవ్వాతాతలను పట్టించుకోలేదు’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్‌..వంచనతో బాబు.. మంచితో జగన్‌ ఎన్నికలకు వెళ్తున్నాం. జగన్‌కు ఓటేస్తే.. సంక్షేమ పథకాలు కొనసాగింపు..బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపే.బాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబు వంచన చేస్తే.. మీ జగన్‌ మంచి చేశాడు’’ అని సీఎం పేర్కొన్నారు.