Andhra Pradesh: విజయసాయి రెడ్డి నాకు తండ్రి లాంటివాడు, రూ.75 కోట్ల కోసం ఇంత నీచపు ఆరోపణలు చేస్తారా, భర్త ప్రెగ్నెన్సీ ఆరోపణలపై స్పందించిన శాంతి
విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Vjy, July 15: నేను విదేశాల్లో ఉండగానే నా భార్య దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి గర్భం దాల్చిందంటూ ఆమె భర్త మదన్‌మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వార్త సంచలనం రేపిన సంగతి విదితమే. తన భార్య ప్రెగ్నెన్సీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ కారణమని ఆమె భర్త మదన్‌మోహన్ ఇచ్చిన ఫిర్యాదుపై కె.శాంతి స్పందించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తాను గిరిజన మహిళను కాబట్టే తనను టార్గెట్ చేశారని కన్నీరు పెట్టుకున్నారు. కక్ష గట్టి తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.‘2013లో మదన్‌మోహన్‌తో నాకు వివాహం జరిగింది. లా చదువుతుండగానే మా ఇద్దరి పెళ్లి జరిగింది. మదన్‌మోహన్ మానిపాటితో 2013లో తనకు వివాహమైందని.. ఆయనతో ఇద్దరు బిడ్డలను కన్నానని కె.శాంతి తెలిపారు. ఆయన వేధింపులు భరించలేక గిరిజన సంప్రదాయ ప్రకారం 2016లోనే విడాకులు తీసుకున్నానని పేర్కొన్నారు. 2020లో న్యాయవాది సుభాష్‌ను పెళ్లి చేసుకున్నానని, ఆయనతోనే ఒక బిడ్డను కన్నానని చెప్పారు. మరొకరి భార్యను అని తెలిసి కూడా మదన్‌మోహన్ తనను తీవ్రంగా వేధించాడని, కోట్ల రూపాయలు సంపాదించి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. 30 రోజుల పాలనలోనే ఇంత మోసమా, చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేత గుడివాడ అమరనాథ్
నేను రూ.100కోట్లు సంపాదించానని ఆంధ్రజ్యోతిలో రాశారు. రూ.75కోట్లు ఇవ్వాలని మదన్‌మోహన్ అడుగుతున్నాడు. నేను గిరిజన మహిళని కక్ష గట్టి నన్ను సస్పెండ్ చేశారు. తప్పుడు వార్తలు రాసేటప్పుడు పెద్దాయన వయసు గుర్తు రాలేదా?. సమాజంలో మర్యాద ఉన్న వ్యక్తిపై ఆరోపణలు ఎలా చేస్తారు. నా వివరణ కూడా తీసుకోకుండా ఇష్టానుసారం రాసేశారు. ఇది ఖచ్చితంగా వ్యక్తిత్వ హననమే’ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యేలు దోచుకోవడానికే ఉచిత ఇసుక పాలసీ, కూటమి ప్రభుత్వంపై మండిపడిన పేర్నినాని
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని తాను వైజాగ్‌లోనే చూశానని.. ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించానని కె.శాంతి తెలిపారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటకడుతున్నారని.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డితో నాకు సంబంధం అంటగట్టడానికి సిగ్గులేదా? ఆయన వయసుకు అయినా గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఒకవేళ నేను చనిపోతే నాపై ఆరోపణలు చేసిన వారే నా చావుకు కారణమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి తనకు తండ్రిలాంటి వారని.. దయచేసి ఆయనతో తనకు సంబంధం అంటగట్టకండి అని విజ్ఞప్తి చేశారు