CM Jagan Speech at Tenali: తెనాలిలో చంద్రబాబుపై సెటైర్లు పేల్చిన సీఎం జగన్, దుష్టచతుష్టయానికి తోడు దత్తపుత్రుడు కలిశాడంటూ పవన్‌ను వదలని ముఖ్యమంత్రి

YS Jagan (Photo-Video Grab)

Tenali, Feb 28: వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమచేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్‌ (CM Jagan Speech at Tenali) మాట్లాడుతూ.. ‘మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ్ల రైతులకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. 50 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

వరుసగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నిధులు (YSR Rythu Bharosa) విడుదల చేస్తున్నాం. తుఫాన్‌ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఏటా రూ.13,500 భరోసా అందిస్తున్నాము. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 50.92 లక్షల మందికి రూ.5,853.74 కోట్లు లబ్ధిచేకూరింది. మూడో విడత కింద 51.12 లక్షల మందికి రూ. 1.090.76 కోట్లు జమ చేస్తున్నాం.

వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను వారి అకౌంట్లలో జమ చేసిన సీఎం జగన్

నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54వేల చొప్పున సాయం అందించాం. ఈ నాలుగేళ్ల కాలంలో రైతు భరోసా కింద రూ.27,062 కోట్లు సాయం అందజేశాము. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నాము. మాండూస్‌ తుఫాన్‌ వల్ల పంట నష్టపోయిన 91,237 మంది రైతులకు రూ. 76,99 కోట్లు అందిస్తున్నాం. వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుంటారు. రైతుల బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఎక్కడా కరువు అనే మాటే లేదు.

తగ్గని జగన్ మేనియా, 5 ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం, మిగతా నాలుగు స్థానాలకు పోటీ, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పలువురు అభ్యర్థులు బరిలో..

2014-19 మధ్య గత ప్రభుత్వంలో ఓ అన్యాయస్థుడు సీఎంగా (CM) ఉన్నాడు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే ఉంది. కరువుకు కేరాఫ్‌ అ‍డ్రస్‌ చంద్రబాబు. మాజీ సీఎం హయంలో ఏటా కరువు మండలాల ప్రకటనే ఉండేది. నాలుగేళ్లుగా ప్రతి చెరువు, రిజర్వాయర్‌ నిండాయి. రాష్ట్రంలో నాలుగేళ్లుగా భూగర్భ జలాలు పెరిగాయి. నాలుగేళ్లుగా ఆహార ధాన్యాల దిగుబడి సగటున 166 లక్షల టన్నులకు పెరిగింది. నాలుగేళ్లుగా రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగింది. ధాన్యం సేకరణ కోసం ఇప్పటి వరకు రూ. 55వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం. రైతు భరోసా ద్వారా రూ.27వేల కోట్లు అందజేశాం.

టీడీపీ చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ( CM YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉంది. కడుపు మంటకు, అసూయకు అసలే మందు లేదంటూ సీఎం సెటైర్లు వేశారు.రాష్ట్రంలో ఈరోజు యుద్ధం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కరువుతో స్నేహం చేసిన చంద్రబాబుకు మీ బిడ్డకు మధ్య యుద్ధం జరగబోతోంది. వచ్చే ఎన్నికల్లో ఇంగ్లీష్‌ మీడియం వద్దన్న చంద్రబాబుకు మీ బిడ్డకు యుద్ధం జరగబోతోంది. రాష్ట్రంలో గజ దొంగల ముఠా ఉంది. ఈ ముఠా పని దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే. గజదొంగల ముఠాలో ఇంకొకరు దత్తపుత్రుడు. దుష్టచతుష్టయానికి తోడు దత్తపుత్రుడు (Pawan Kalyan) జతకలిశాడు.

చంద్రబాబు (ChandraBabu Naidu) ఎందుకు సంక్షేమ పథకాలు పెట్టలేకపోయాడు. ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?. ఇప్పుడు కూడా అదే బడ్జెట్‌, అదే రాష్ట్రం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వ్యతిరేకం అన్నాడు చంద్రబాబు. మీ బిడ్డ పాలనకు.. చంద్రబాబు పాలనకు వ్యత్యాసాన్ని గమనించాలి. మంచి చేశాం, మంచి జరిగిందని అనిపిస్తే తోడుగా ఉండండి. మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో చూసుకోండి. ఇచ్చిన హామీలు అన్ని నెరవేస్తున్నాం. చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్‌ విసురుతున్నాను. 175కి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా?. మీ బిడ్డకు భయంలేదు. నా దగ్గర ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లేదు.. దతపుత్రుడు లేడు. అయినా సరే.. మేము చేసిన మంచి చెప్పుకునే మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని అన్నారు.

పట్టా ఉన్న రైతులకే కాకుండా అసైన్డ్‌ భూముల రైతులు, కౌలు రైతులలకూ రైతు భరోసా అందించాము. ఆర్బీకేల ద్వారా రైతన్నలకు విత్తనం నుంచి ఎరువుల వరకు తోడుగా నిలిచాం. మన ఆర్బీకేలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. టీడీపీ పాలనలో ఐదేళ్లలో 30.85 లక్షల మంది రైతులకు రూ. 3,411 కోట్లు మాత్ర​మే అందించారు. మన ప్రభుత్వంలో గడిచిన నాలుగేళ్లుగా రైతులకు రూ.6,685 కోట్ల సాయం అందించాం. రైతన్నకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం తీర్చుతున్నాం. సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు రూ,1,834 కోట్లు చెల్లించాం​. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబుకు మన ప్రభుత్వం మీద కడుపు మండుతోంది. కడుపు మంటకు, అసూయకు అసలే మందు లేదు. చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ. మనది పేదల ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం’ అని అన్నారు.

కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. ఏ సీజన్‌లో పంట నష్టం ఆ సీజన్‌లోనే అందిస్తున్న ఏకైన సీఎం వైఎస్‌ జగన్‌. దేశంలోనే వందశాతం రైతు బీమా ప్రీమియం భరించిన ఏకైన రాష్ట్రం ఏపీ. చంద్రబాబు హయంలో అన్నీ కరువు కాటకాలే అని అన్నారు.

తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ పాదయాత్ర రాష్ట్రంలో ప్రజల గుండె చప్పుడు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పాలన అందుతోంది. రైతు భరోసా, అ‍మ్మఒడి, జగనన్న విద్యాకానుక, చేయూత వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. జగనన్న సేవకుడు శివకుమార్‌ అన్ని అన్నారు. నియోజకవర్గంలో పేదలకు 26వేల ఇళ్లు ఇచ్చిన ఘనత సీఎం జగనన్నకే దక్కింది. తెనాలి గడ్డ.. జగనన్న అడ్డ అని అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now