New Traffic Fines in AP: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ. 10 వేలు ఫైన్, ఏపీలో సవరించిన వాహన జరిమానా వివరాలు ఓ సారి తప్పక తెలుసుకోండి
మోటార్ సైకిళ్లు, సెవెన్ సీటర్ కార్ల వరకు ఒక కేటగిరీగా, భారీ వాహనాలు మరో కేటగిరీగా వాహన జరిమానాలు (Traffic Violation Fines) సవరిస్తూ బుధవారం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు ఉత్తర్వులు (violation of traffic regulations) జారీ చేశారు.
Amaravati, Oct 23: ఏపీలో మోటార్ వాహనాల నిబంధనలను ఉల్లంఘించినవారికి విధించే జరిమానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) భారీగా పెంచింది. మోటార్ సైకిళ్లు, సెవెన్ సీటర్ కార్ల వరకు ఒక కేటగిరీగా, భారీ వాహనాలు మరో కేటగిరీగా వాహన జరిమానాలు (Traffic Violation Fines) సవరిస్తూ బుధవారం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు ఉత్తర్వులు (violation of traffic regulations) జారీ చేశారు.
కొత్తగా వచ్చిన జరిమానాలను ఓ సారి పరిశీలిస్తే.. బండి వేగంగా నడిపితే రూ.1,000.. సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10 వేలు.. రేసింగ్ మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు.. రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.5 వేలు.. పర్మిట్‌లేని వాహనాలు వాడితే రూ.10 వేలు.. ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు, ఆపై టన్నుకు రూ.2 వేలు అదనం.
వాహనం బరువు చెకింగ్ కోసం ఆపకపోయినా రూ.40 వేలు జరిమానా.. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.1,000, అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ.1,000, రెండోసారి రూ.2 వేలు జరిమానా.. వాహన తనిఖీ విధులకు ఆటంకం కలిగిస్తే రూ.750, సమాచారం ఇవ్వకపోతే రూ.750, అనుమతి లేని వ్యక్తులకు వాహనం ఇస్తే రూ.5 వేలుగా నిర్ణయించింది.
అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే రూ.5 వేలు, డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10 వేలు, నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5 వేలు చొప్పున జరిమానాలు విధించింది. ఇక వాహనాల తనిఖీ సమయంలో సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తే రూ.750 జరిమానా విధిస్తారు. అనుమతి లేని వారికి వాహనం ఇస్తే రూ. 5 వేలు ఫైన వేయనున్నారు. డ్రైవింగ్ అర్హత లేని వారికి బండి ఇస్తే రూ. 10 వేలు చలానా వేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5 వేలు జరిమానా వేయనున్నారు. అలాగే తయారు చేసిన కంపెనీలకు, అమ్మిన డీలర్లకు లక్షల్లో జరిమానా విధించనున్నారు.