Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

Amaravati. Oct 23: ఏపీలో గడిచిన 24 గంటల్లో 76,726 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,620 కోవిడ్‌ పాజిటివ్‌గా (AP Coronavirus) నిర్థారణ అయింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,96,919కి చేరింది. కరోనా నుంచి కొత్తగా 3,723 మంది డిశ్చార్జి కాగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,58,138గా ఉంది. కరోనాతో కొత్తగా 16 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,524కు (Covid Deaths) చేరింది. ఏపీలో ప్రస్తుతం 32,257 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 10.85శాతం ఉండగా.. ప్రతి మిలియన్‌ జనాభాకు 1,37,599 కరోనా పరీక్షలు చేపడుతున్నారు.

ఏపీలో కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు (Covid Tests) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 73, 47,776 మందికి కరోనా సాంపిల్స్‌ పరీక్షించారు. జిల్లాల వారీగా చూస్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం కొత్తగా 680 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 88,226కి చేరింది. కరోనాతో మరొకరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 486కి చేరింది. తూర్పుగోదావరిలో కొత్తగా 492 మందికి వైరస్‌ సోకింది. మరణాలు కూడా 600కి చేరువయ్యాయి. చిత్తూరు జిల్లాలో మరో 412 మంది వైరస్‌ బారినపడగా.. బాధితుల సంఖ్య 75వేల మార్కు దాటేసింది. కరోనాతో ఇప్పటి వరకు 754 మంది ప్రాణాలు కోల్పోయారు.

రెండు చోట్ల ఇళ్లు ఎందుకు? ప్రజాధనాన్ని వృథా చేయడమే కదా? నిమ్మగడ్డ పిటిషన్ సంధర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

కృష్ణా జిల్లాలో కొత్తగా 370 మందికి కరోనా వైరస్‌ సోకింది. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. గుంటూరు జిల్లాలో 385 మందికి వైరస్‌ సోకగా.. కర్నూలు జిల్లాలో మరో 66 కేసులు బయటపడ్డాయి. కడప జిల్లాలో 212 మందికి వైరస్‌ సోకింది. ఇప్పటి వరకు 492 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురంలో 196 మంది కరోనా బారినపడగా.. నెల్లూరులో 126 మందికి పాజిటివ్‌గా తేలింది. విశాఖ జిలాల్లో 171 కేసులు బయటపడగా.. శ్రీకాకుళం జిల్లాలో మరో 126 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో తాజాగా 122 మందికి వైరస్‌ సోకగా ఇప్పటి వరకు 195 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ప్రకాశం జిల్లాలో 311 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా భారిన పడిన వారి సంఖ్య 57,636కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 34 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా భారిన పడి ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 565 మంది చనిపోయారు. గురువారం నాడు కరోనా నుండి కోలుకుని 48 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 2,785 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.