Andhra Pradesh: జగన్ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు

గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండర్ జీవో నంబరు 67ను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది.

AP Government logo (Photo-Wikimedia Commons)

Vjy, Sep 16: గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండర్ జీవో నంబరు 67ను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది.

2019లో జగన్ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రివర్స్ టెండరింగ్ స్థానంలో పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ పనులకు ఇక నుంచి పాత టెండర్ విధానాన్ని అనుసరించాలని జీవోలో స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, విశాఖ టూ దుర్గ్, సికింద్రాబాద్ టూ నాగ్‌పూర్ వెళ్లనున్న న్యూ ట్రైన్స్

రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతి (2003 జూలై 1న జారీ చేసిన జీవో 94) ప్రకారమే టెండర్లు పిలిచి, పనులను కాంట్రాక్టర్లకు అప్ప­గించాలని ఆగస్టు 28న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దానిని అమలు చేస్తూ ఆదివారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు (జీవో ఎంఎస్‌ నంబర్‌ 40) జారీ చేశారు.