Reverse Tendering Orders: పనులు రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, టెండర్ కమ్ రివర్స్ ఆక్షన్ విధానం ద్వారానే కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ
ఈ ఉత్తర్వుల్లో భాగంగా కోటి రూపాయలు దాటిన వస్తు, సేవల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ (Reverse Tendering) చేపట్టనుంది. వ్యాపార కొనుగోళ్లలో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా జగన్ సర్కారు (YS Jagan Govt) ఆదేశించింది. కోటి రూపాయల విలువదాటిన ప్రతీ లావాదేవీని రివర్స్ టెండరింగ్ ద్వారా చేపట్టాలని, టెండర్ కమ్ రివర్స్ ఆక్షన్ విధానం ద్వారానే కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
Amaravati, August 26: అవినీతి నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం (Government of Andhra Pradesh) మరో కీలక నిర్ణయం తీసుకుంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో భాగంగా కోటి రూపాయలు దాటిన వస్తు, సేవల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ (Reverse Tendering) చేపట్టనుంది. వ్యాపార కొనుగోళ్లలో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా జగన్ సర్కారు (YS Jagan Govt) ఆదేశించింది. కోటి రూపాయల విలువదాటిన ప్రతీ లావాదేవీని రివర్స్ టెండరింగ్ ద్వారా చేపట్టాలని, టెండర్ కమ్ రివర్స్ ఆక్షన్ విధానం ద్వారానే కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ పనుల్లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా అయ్యిందని ప్రభుత్వం పేర్కొంది. టెండర్ కమ్ రివర్స్ ఆక్షనింగ్ లేదా రివర్స్ టెండర్ల విధానాన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు విధిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా చికిత్సకు ఎక్కువ రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు, ఆస్పత్రులు కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలని కోరిన ఏపీ సీఎం జగన్
రివర్స్ టెండరింగ్ లో ఈ-ప్రోక్యూర్ మెంట్ విధానం అమలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ను ప్రభుత్వం ఆదేశించింది. చెల్లింపుల విధానంలోనూ మార్పులు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం సీఎఫ్ఎస్ఎస్‌కు సూచనలు చేసింది. శత్రువులు ఎక్కువ, అందుకే వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోంది
ఈ నిర్ణయం టీడీపీని మరింత ఇరుకున పెట్టేలా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా డబ్బు ఆదా కానుంది. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వశాఖలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, అన్ని ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటిలోనూ కోటి దాటిన పనుల్లో రివర్స్ టెండరింగ్ తప్పదు. ఈ ఆదేశాలు కూడా తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. దీంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించకపోతే బిల్లులు ఆపేస్తామన్న ప్రకటన ఇప్పుడు కాంట్రాక్టర్లను అయోమయానికి గురిచేస్తోంది.