Animal Health Cards in AP: ఏపీ ప్రభుత్వం మరో సంచలన పథకం, మూగ జీవాల కోసం వైఎస్సార్ పశు సంరక్షణ స్కీం, మూగజీవాలకు ఆరోగ్య రక్షణ కార్డులు మంజూరు
పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ ప్రజా సంక్షేమంతో పాటు మూగ జీవాల రక్షన కోసం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా మూగప్రాణులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల యజమానులు, పెంపకం దారులకు ఆసరాగా నిలిచేందుకు వైఎస్సార్ పశుసంరక్షణ పథకానికి (YSR Pasu Samrakshana Scheme) శ్రీకారం చుట్టారు.
Amaravati, June 25: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ ప్రజా సంక్షేమంతో పాటు మూగ జీవాల రక్షన కోసం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా మూగప్రాణులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల యజమానులు, పెంపకం దారులకు ఆసరాగా నిలిచేందుకు వైఎస్సార్ పశు సంరక్షణ పథకానికి (YSR Pasu Samrakshana Scheme) శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ పుట్టిన రోజున ఏపీ సీఎం భారీ గిఫ్ట్, పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ, ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు
ఈ పథకం ద్వారా యజమానులకు ఆరోగ్య సంరక్షణ కార్డులు (Animal Health Cards) అందించి పశువులు, గొర్రెలు, మేకల ఆరోగ్యాన్ని సంరక్షించనుంది. జిల్లా వ్యాప్తంగా యానిమెల్ హెల్త్‌కార్డుల (Animal Health Card in AP) ద్వారా లక్షమంది పశుసంద కలిగిన రైతులకు, గొర్రెల యజమానులకు, కాపరులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో 75 వేల పెద్దపశువులు, 25 వేల మంది గొర్రెలు, మేకల యజమానులకు, కాపరులకు దీని ద్వారా కార్డులందించనున్నారు. గ్రామ సచివాలయానికి అనుసందానంగా పశువైద్య సహాయకులు ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం పశుసవర్ధకశాఖ 085–00–00–1962, రైతుభరోసా కేంద్రాల టోల్‌ఫ్రీ నంబరు 1907కు కాల్ చేయవచ్చు. ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు! జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో కొత్త జిల్లాల అంశాన్ని ప్రస్తావించిన ఏపీ సీఎం, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన
ఈ పథకం ప్రకారం ఎలాంటి ముందస్తు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాన్ని (Y.S.R Pashu Nasta Parihara Padakam) అర్హులకు అందిస్తారు. జీవాల పునరుత్పాదక దశలో 2 నుంచి 10 ఏళ్ల వయసున్న ఆవులు, 3 నుంచి 12 ఏళ్ల వయసున్న గేదెలకు వర్తింపజేస్తారు. మేలుజాతి స్వదేశీ ఆవు ఒక్కింటికి రూ.30 వేలు, దేశవాళీ గేదె మరణిస్తే రూ.15వేలు పరిహారం అందిస్తారు. ఏడాదికి ఒక పాడి రైతు కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం ఉంది. ఆరు నెలల నుంచి ఆపై వయసున్న మేకలు, గొర్రెలకు ఈ పథకం వర్తింపజేస్తారు. ఒకేసారి మూడు నుంచి అంతకన్నా ఎక్కువ జీవాలు మరణిస్తే పథకం వర్తిస్తుంది. ఒక్కో జీవానికి రూ.6వేల వంతున ఏడాదిలో ఒక్కో కుటుంబం గరిష్టంగా రూ.1.20 లక్షలు పరిహారం పొందవచ్చు.
గడిచిన ఏడాది కాలంలో పథకం ద్వారా రూ.1.35 కోట్ల నష్టపరిహారం పశువులు, జీవాలను నష్టపోయిన అర్హులకు అందించాం. మరో రెండు కోట్ల పరిహారానికి సంబంధించి నగదు త్వరలో లబ్ధిదారులకు అందించనున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులు, యజమానులు, కాపర్లు తమ వివరాలు నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులకు కార్డులను ఆర్‌బీకేల ద్వారా అందిస్తారు. ఈ కార్డులు నాలుగేళ్లు పాటు పనిచేస్తాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)