Liquor Prices Slashed in AP: వైరల్ వీడియో.. మందు షాపుకు పూజ చేసి, టెంకాయ కొట్టిన మందుబాబులు, ఏపీలో భారీగా తగ్గిన మద్యం ధరలు, కొత్తగా అమల్లోకి వచ్చిన మద్యం ధరలు ఇవే..

ఇన్నాళ్లు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసిన మద్యం ఇప్పుడు కొంత చవగ్గా లభిస్తుండడంతో వారు ఖుషీలో మునిగి తేలుతున్నారు. కాగా మద్యం ధరలు తగ్గిస్తూ (Liquor Prices Slashed in AP) ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.

Long Queue Outside Liquor Shop (Photo Credits: Twitter/@Yatharth9815)

Amaravati, Dec 20: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గడంతో మందుబాబుల పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసిన మద్యం ఇప్పుడు కొంత చవగ్గా లభిస్తుండడంతో వారు ఖుషీలో మునిగి తేలుతున్నారు. కాగా మద్యం ధరలు తగ్గిస్తూ (Liquor Prices Slashed in AP) ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆయా బ్రాండ్ మద్యం ధరల్ని బట్టి 15 నుంచి 20 శాతం (liquor prices by 15-20%) తగ్గించింది. బ్రాండ్‌ను బట్టి క్వార్టర్‌పై కనీసం రూ. 20 నుంచి రూ. 50 వరకు, ఫుల్ బాటిల్‌పై రూ. 120 నుంచి రూ. 200 వరకు తగ్గించింది. అలాగే అన్ని రకాల బీర్లపై రూ. 20 నుంచి రూ. 30 వరకూ తగ్గింది.

ఐఎంఎల్‌ లిక్కర్‌పై వ్యాట్‌ 35 నుంచి 50 శాతం వరకు తగ్గింది. స్పెషల్‌ మార్జిన్‌ 10 నుంచి 20 శాతం, అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ 5 నుంచి 26 శాతం వరకు ప్రభుత్వం (Andhra Pradesh government) తగ్గించింది. వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ మార్జిన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇండియన్‌ మేడ్‌ఫారిన్‌ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం తగ్గించింది. అన్ని కేటగిరిల మద్యంపై 20 శాతం వరకు ధరలను తగ్గించనుంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకు ధర తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు డిసెంబర్ 19 నుంచి అమల్లోకి వచ్చాయి.

Here's Viral Video

వచ్చే వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37 శాతం మేర మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో తెలిపింది.

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, సినిమా టికెట్ల విక్రయానికి ప్రత్యేక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం, APSFTVTDCకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ

ఇక ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం దుకాణం వద్ద నిన్న ఏకంగా కొందరు మందుబాబులు పూజలే నిర్వహించారు. దుకాణానికి హారతులు ఇచ్చి పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే మద్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది