Biswabhusan Harichandan: మూడు రాజధానులపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు, అభివృద్ది, అధికార వికేంద్రీకరణతోనే అన్నీ సాధ్యమన్న బిశ్వభూషణ్ హరిచందన్, జాతీయజెండాను ఆవిష్కరించిన ఏపీ గవర్నర్
విజయవాడ (Vijayawada)ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు అంబరాన్ని తాకాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, (Biswabhusan Harichandan) ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
Vijayawada,January 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (India Republic Day 2020) ఘనంగా జరిగాయి. విజయవాడ (Vijayawada) లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు అంబరాన్ని తాకాయి.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, (Biswabhusan Harichandan) ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఢిల్లీలో అదరహో అనిపిస్తున్న తెలుగు రాష్ట్రాల శకటాలు
గవర్నర్ బిశ్వభూషణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల అంశంపై (Three Capital Row) ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Republic Day 2020 Greetings కోసం క్లిక్ చేయండి
రాజధాని వికేంద్రీకరణపై గవర్నర్ మాట్లాడుతూ,, అభివృద్ది, అధికార వికేంద్రీకరణతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని గవర్నర్ చెప్పారు. దీంతో మూడు రాజధానులకు ఆయన మద్దతిచ్చినట్టు అయ్యిందని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్, ఏపీ సీఎం
ఏపీ ప్రభుత్వం నవరత్నాలతో ప్రజల సంక్షేమం కోసం పని చేస్తోందని గవర్నర్ కితాబిచ్చారు. రైతులకు నేస్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ధరల స్థిరీకరణ కోసం రూ.3వేల కోట్ల నిధి, రైతు భరోసా పథకం ద్వారా రూ.13వేల 500, రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్ వంటి పథకాలను దిగ్విజయంగా ముందుకు తీసుకు వెళుతోందని తెలిపారు.
భారత గణతంత్ర దినోత్సవం, ఇండియా వైభవాన్ని విశ్యవ్యాప్తం చేసిన గూగుల్ డూడుల్
ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా 100 శాతం అక్షరాస్యతకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదని అమ్మఒడి పథకం ప్రారంభించిదని గుర్తుచేశారు. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాద్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ అన్నారు. సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందుతున్నాయని చెప్పారు. సచివాలయాల ద్వారా 4 లక్షలు ఉద్యోగాలు లభించాయన్నారు.