Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై నేటి నుంచి ఏడాది పాటు నిషేధం, నిరుపేదల గృహాల కోసం 5 శాతం భూమి పంపిణీ
నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై (Tobacco Products in AP) నేటి నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తూ కుటుంబ సంక్షేమ,ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Amaravati, Dec 7: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై (Tobacco Products in AP) నేటి నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తూ కుటుంబ సంక్షేమ,ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నిటిపై ప్రభుత్వం బ్యాన్ (Tobacco Products Ban) విధించింది. వీటిని ఏ పేరుతో నైనా తయారు చేయడం అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం నేరమని.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కాటమనేని భాస్కర్ హెచ్చరించారు.
దీంతో పాటు రాష్ట్రంలోని (Andhra Pradesh) ప్రైవేట్ లేఅవుట్‌లలో 5 శాతం భూమిని నిరుపేదల గృహాల కోసం వైఎస్సార్, జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్‌కు కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి సోమవారం గెజిట్ విడుదల చేశారు. ప్రైవేట్ లేఅవుట్ యజమానులు, అభివృద్ధిదారులు 5 శాతం భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపీలో గడచిన 24 గంటల్లో 122 మందికి పాజిటివ్, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 31 కొత్త కేసులు నమోదు
ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసే లేఅవుట్‌లో 5 శాతం స్థలం కేటాయించడానికి ఇష్టం లేకపోతే.. అదే లేఅవుట్‌కు 3 కి.మీ పరిధిలో మరో చోట ఆ మేరకు భూమిని కేటాయించవచ్చు. లేని పక్షంలో 5 శాతం భూమి ధరను సంబంధిత మున్సిపాలిటీకి/పట్టణ అభివృద్ధి సంస్థకు చెల్లించవచ్చు.