Salaries Defer in AP: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీతాల చెల్లింపు వాయిదా, లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత జీత భత్యాలు చెల్లించే అవకాశం, కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీత భత్యాలను ఈ నెలకు ఇవ్వడం లేదని తెలిపింది. వారందరి జీత భత్యాలు చెల్లింపును వాయిదా వేసింది. దీనికి సంబంధించిన జీవోను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan) జారీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో 100 శాతం జీత భత్యాలను వారికి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
Amaravati, April 1: ఏపీలో కరోనా వైరస్ (Coronavirus in AP) చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు (Jagan Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీత భత్యాలను ఈ నెలకు ఇవ్వడం లేదని తెలిపింది. వారందరి జీత భత్యాలు చెల్లింపును వాయిదా వేసింది.
దీనికి సంబంధించిన జీవోను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan) జారీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో 100 శాతం జీత భత్యాలను వారికి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే కరోనాను ఎదుర్కునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (Andhra Pradesh Govt) నిధులు చాలా ఎక్కువ స్థాయిలో అవసరం పడుతున్నాయి.ముఖ్యంగా శానిటేషన్, వైద్య ఖర్చులు, పోలీసు ఖర్చులు .. ఇలా చాలా వ్యయాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Here's ANI Tweet
ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలతోపాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు.. ఇలా అందరి జీతభత్యాల చెల్లింపు (Salary Deferrals in AP) నిలిపివేశారు. 'కరోనా వైరస్'ను ధీటుగా ఎదుర్కునేందుకు కేంద్రం విధించిన లాక్ డౌన్ పూర్తయిన తర్వాత జీత భత్యాలు చెల్లించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరింది. 24 గంటల్లో ఏపీలో మొత్తం 21 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం రాత్రి 9 గంటల తర్వాత మొత్తం 256 శాంపిళ్లను పరీక్షించగా 21 కరోనా పాజిటివ్, 235 కరోనా నెగిటివ్‌గా తేలాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఇద్దరు కోలుకున్నట్టు చెప్పారు. కాగా మార్చి 30వ తేదీ సోమవారం రాత్రి వరకు 23 పాజిటివ్ కేసులతో ఉన్న రాష్ట్రం.. మంగళవారం నాటికి ఒక్క రోజు వ్యవధిలో ఆ సంఖ్య 44కు చేరింది.