Coronavirus Alert in AP: ఏపీలో ‘ఢిల్లీ’ కరోనా కల్లోలం, ఒక్కరోజే 21 కేసులు నమోదు, 44కి చేరిన పాజిటివ్ కేసులు, హై అలర్ట్ అయిన ఏపీ సర్కారు
Coronavirus Outbreak (Photo Credits: IANS)

Amaravati, April 1: ఏపీలో కరోనావైరస్ కలకలం (coronavirus pandamic) ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. ఒక్కసారిగా ఏపీలో కేసులు (Covid 19 in AP) పెరిగిపోవడంతో ఏపీ సర్కారు అలర్ట్ (AP Govt) అయింది. ఏపీ పోలీస్ యంత్రాగాన్ని (AP Police) అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ప్రధానంగా కోవిడ్‌ 19 (Covid-19) వ్యాపిస్తోందని వారిని కట్టడి చేసింది.

టూరిస్ట్ వీసాతో వచ్చి మతపరమైన ప్రచారం నిర్వహించిన విదేశీయులు

అయితే ఊహించని విధంగా ఢిల్లీ నుంచి వచ్చిన వారి నుంచి ప్రమాదం ముంచుకు రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించిన పోలీసులు ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగారు.

ఈ కార్యక్రమానికి ఏపీ రాష్ట్రం నుంచి 369 మంది హాజరయ్యారని అనధికార సమాచారం. వీరంతా ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో మార్చి 13 నుంచి 16 వరకు ప్రార్థనలు నిర్వహించారు. తిరిగి 17, 18, 19 తేదీల్లో తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో అత్యధికం ఢిల్లీ వెళ్లొచ్చిన వారేనని నిర్ధారణ కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయి వారిపై నిఘా పెట్టింది.

ఢిల్లీ మత ప్రార్థనల్లో కరోనావైరస్ కల్లోలం, ఆరుమంది మృతి, మర్కజ్‌ మౌలానాపై కేసు నమోదు

కాగా ఢిల్లీ నుంచి ఏపీకి మొత్తం 1470 మంది ప్రయాణికులు వచ్చారని ప్రభుత్వం గుర్తించింది. వారిలో 1321 మందిని ఏపీ ఇప్పటికే గుర్తించగా 149 మంది వివరాలు తెలియాల్సి ఉంది. వీరిలో క్వారంటైన్ కి 598మంది వెళ్లారు. ఆస్పత్రిలో 405 మంది ఉన్నారు. ఇంకా 318 మంది వివరాలు తెలియాల్సి ఉంది. వీరిలో 535 మంది నమూనాలు సేకరించగా 115 మందికి నెగిటివ్ వచ్చింది. 16 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఇంకా 404 మంది రిపోర్ట్ రావాల్సి ఉంది.

ఇప్పటికే కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాలతోపాటు అనుమానితులు, ఢిల్లీ వెళ్లి వచ్చినవారు ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ, వైద్య ఆరోగ్య సిబ్బందితో పోలీసులు జల్లెడ పడుతున్నారు. కోవిడ్‌ సోకిందని అనుమానించే వారంతా స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలని అధికారులు కోరుతున్నారు. అలా రానివారిని నిర్బంధంగా క్వారంటైన్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ రహస్యంగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే పోలీసు కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు.

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఇప్పటికే రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ అమలవుతుండగా కొన్ని చోట్ల 144 సెక్షన్‌ విధించారు. కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్న చోట లాక్‌డౌన్‌ను సడలించకుండా కఠినంగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అవసరమైతే కర్ఫ్యూ పెట్టే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

ఇండియాలో ఒక్కరోజే 227 కొత్త కేసులు నమోదు

ఇప్పటి వరకు విదేశాల నుంచి 1,816 మంది వచ్చినట్లు యంత్రాంగం గుర్తించింది. వారిని హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంచింది. గృహ నిర్బంధానికి ఇష్టపడని వారిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించింది. ఇప్పటివరకు సుమారు 1,472 మందికి క్వారంటైన్‌ పూర్తయ్యింది. వారిలో 86 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి మాత్రం పాజిటివ్‌ వచ్చింది. 55 మందికి నెగటివ్‌ రాగా.. 30 మంది ఫలితాల వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ ఫలితాల కోసం యంత్రాంగం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అలాగే పోలీసులు కూడా ప్రతి స్టేషన్‌ పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వారికోసం ఆరా తీస్తున్నారు.

కరోనాపేషెంట్లపై నిఘా కోసం ట్రాకింగ్ సిస్టం

కరోనా లక్షణాలు ఎవరిలో కనిపించినా సమాచారం ఇవ్వాలి. విదేశాల నుంచి వచ్చిన వారిని దాచినా, ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతున్నా తప్పనిసరిగా డయల్‌–100, 104, ఫోన్‌– 08572–235900, 9441486168, 9849902379 నంబర్లకు ఫోన్‌ ద్వారా తెలియజేయాలి. వెంటనే పోలీస్, వైద్యశాఖ సిబ్బంది రంగంలోకి దిగి వారిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తారు. అలాగే ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను కూడా అధికారులకు అందించాలి.

ఏపీలో కరోనా కట్టడికి డ్రోన్ల వినియోగం

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 44కు చేరింది. 24 గంటల్లో ఏపీలో మొత్తం 21 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం రాత్రి 9 గంటల తర్వాత మొత్తం 256 శాంపిళ్లను పరీక్షించగా 21 కరోనా పాజిటివ్‌, 235 కరోనా నెగిటివ్‌గా తేలాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఇద్దరు కోలుకున్నట్టు చెప్పారు. కాగా మార్చి 30వ తేదీ సోమవారం రాత్రి వరకు 23 పాజిటివ్‌ కేసులతో ఉన్న రాష్ట్రం.. మంగళవారం నాటికి ఒక్క రోజు వ్యవధిలో ఆ సంఖ్య 44కు చేరింది.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు..

ప్రకాశం - 11

విశాఖపట్నం - 10

గుంటూరు -9

కృష్ణా -5

తూర్పు గోదావరి -4

అనంతపురం-2

చిత్తూరు -1

నెల్లూరు -1

కర్నూలు-1