Corona Cases in AP: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, ఒక్కరోజే 17 కొత్త కేసులు, 40కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, విశాఖలో కరోనాను జయించిన అర‌వై ఏళ్ల వృద్ధుడు
Coronavirus scanning (Photo Credit: PTI)

Amaravati, Mar 31: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) లాక్ డౌన్ పాటిస్తున్నా కరోనా పాజిటీవ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 17 పాజిటీవ్ కేసులు (coronavirus cases in AP) నమోదయ్యాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో కొందరికీ వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. గత రాత్రి వరకు 164 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా 147 మందికి నెగిటివ్ రాగా 17 మందికి పాజిటీవ్ వచ్చింది.

ఇండియాలో ఒక్కరోజే 227 కొత్త కేసులు నమోదు

ఏపీలో (AP) ఇప్పటి వరకు అతి ఎక్కువగా ప్రకాశం జిల్లాలో 11 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ (Delhi) నుంచి వచ్చినవాళ్లంతా స్వచ్చంధంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మొత్తం మీద నిన్న ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసే నాటికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 40కి చేరాయి. 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో అత్యధికంగా 11 కేసులు నమోదవ్వగా, చీరాల పట్టణంలో కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. గుంటూరు - 9, విశాఖ - 6, కృష్ణా - 5, తూ.గో - 4, అనంతపురం - 2, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీ మత ప్రార్థనల్లో కరోనావైరస్ కల్లోలం

ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఆరుగురు మరణించడంతో తెలుగు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ నుంచి ఢిల్లీ మత సమావేశాలకు ఏ జిల్లా నుంచి ఎంతమంది వెళ్లారని ఆరా తీస్తున్నారు. వీళ్లంతా స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన 185మందిలో 140 మందిని గుర్తించామని గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్ చెప్పారు.

కరోనాపేషెంట్లపై నిఘా కోసం ట్రాకింగ్ సిస్టం

103 మందికి పరీక్షలు చేస్తే..ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. మిగిలిన 40 మంది కోసం వెతుకుతున్నామన్నారు. ఢిల్లీ మీటింగ్‌కి వెళ్లిన వారి కుటుంబసభ్యులకూ కరోనా పాజిటివ్‌ ఉందన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛదంగా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. తమకు పట్టుబడితే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నోటీసులు అందుకుని బయటతిరిగితే అరెస్ట్‌ చేస్తామన్నారు.

ఏపీలో కరోనా కట్టడికి డ్రోన్ల వినియోగం

కరోనా మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరిమికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ నాయకులు, బూత్‌ స్థాయి క్రియాశీలక కార్యకర్తలకు దీనిపై ఆయన దిశా నిర్దేశం చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు భౌతిక దూరం పాటిస్తూనే ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని సూచిస్తూ నిర్దిష్ట బాధ్యతలను అప్పగించారు.

ఏప్రిల్ 15 తర్వాత కూడా తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తేసే ఛాన్స్ లేదు

కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్య‌ధికంగా ఆరు కేసులు న‌మోదైన విశాఖ‌ప‌ట్నంలో ఓ క‌రోనా వ్యాధిగ్ర‌స్తుడు కోలుకున్న ఘ‌ట‌న జిల్లావాసుల‌కు ఊర‌ట‌నిస్తోంది. అందులోనూ కరోనాను జయించింది అర‌వై ఏళ్ల వృద్ధుడు కావ‌డం విశేషం. మార్చి 14న మ‌దీనా నుంచి విశాఖ‌కు వ‌చ్చిన ఆయ‌నకు క‌రోనా సోకింది. అత‌నికి చికిత్స అందిస్తున్న వైద్యులు మ‌రోసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ అని తేలింది. దీంతో అత‌న్ని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.