Delhi Nizamuddin Markaz: ఢిల్లీ మత ప్రార్థనల్లో కరోనావైరస్ కల్లోలం, ఆరుమంది మృతి, క్వారంటైన్‌లోకి 2వేల మంది, మర్కజ్‌ మౌలానాపై కేసు నమోదు, ఆదేశించిన ఢిల్లీ సర్కారు
COVID-19 Delhi government to ask police to register FIR against Maulana of Nizamuddin Markaz (Photo-PTI)

New Delhi, Mar 31: ఢిల్లీలో జరిగిన ఓ మత కార్యక్రమం (Delhi Nizamuddin Markaz) దేశంలో ఇప్పుడు కరోనావైరస్ (coronavirus) కల్లోలానికి కారణమైంది. ఆ ప్రార్థనలు దేశంలో ప్రమాద ఘంటికలు మోగించాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ (Delhi Nizamuddin) ప్రాంతంలోని ‘తబ్లిగి ఏ జమాత్‌' మార్చి 1-15 మధ్యలో జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి ఎంతోమంది హాజరయ్యారు.

మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వందలమంది ఇందులో పాల్గొన్నారు. కాగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వీరిలో పలువురికి కరోనా వైరస్‌ సోకినట్టు ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.

కరోనాపేషెంట్లపై నిఘా కోసం ట్రాకింగ్ సిస్టం

కాగా ఈ మత కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణవాసుల్లో (Telangana) ఆరుగురు ఇటీవల మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారి వివరాలను తమకు అందజేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే నిజాముద్దీన్ ప్రాంతంలో దాదాపు వంద మందికి పైగా కరోనా లక్షణాలు కనిపించాయి.ఆ ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

Here's ANI Tweet

నిజాముద్దీన్‌లోని ప్రముఖ మసీదు ఇమామ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం (Delhi government) పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి 300 నుంచి 400 మందితో మతపరమైన కార్యక్రమాన్నినిర్వహించడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ కార్యక్రమానికి మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కజికిస్తాన్ దేశాల నుంచి పలువురు హాజరయ్యారు.

కరోనా అంతు చూస్తామంటున్న కార్పోరేట్, సెలబ్రిటీల నుంచి మినిష్టర్ల దాకా

వీరితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హాజరయినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరయిన వారిలో తమిళనాడుకు చెందిన ఒకరు కరోనా బారిన పడి మరణించగా 100 మందికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయి. తెలంగాణాలో మృతి చెందిన ఆరుమంది కూడా అక్కడికి వెళ్లినవారేనని తెలుస్తోంది. దీంతో.. ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కార్యక్రమానికి హాజరయిన వారందరిపై నిఘా పెట్టింది.

Telangana Govt Alert Tweet

లక్షణాలు కనిపించిన 163 మందిని ఢిల్లీ ప్రభుత్వం బస్సుల్లో లోక్‌ నాయక్ ఆసుపత్రికి తరలించింది. వారికి కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు. మంగళవారం రిపోర్ట్‌లు వచ్చే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. తిరిగి వారి స్వదేశాలకు వెళ్లేందుకు లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో విమాన సర్వీసులు లేకపోవడంతో వారంతా దేశ రాజధానిలోనే ఉన్నారు. కరోనా వైరస్ కేసులు దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న తరుణంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ఈ మతపరమైన కార్యక్రమం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఒకే కుటుంబంలో 25 మందికి కరోనావైరస్, దేశ వ్యాప్తంగా 1071 పాజిటివ్ కేసులు

కాగా ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి హాజరైన వారిలో ఆరుగురిలో ఇద్దరు గాంధీ దవాఖానలో, ఒకరు అపోలో, ఒకరు గ్లోబల్‌ దవాఖానలో, నిజామాబాద్‌, గద్వాలలో ఒక్కొక్కరు మరణించారు. వీరందరికీ కరోనా సోకినట్లు తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. రెండురోజుల క్రితం ఖైరతాబాద్‌ ప్రాంతంలో చనిపోయిన వృద్ధుడు కూడా వీరిలో ఒకరు. ఇతను కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇతనికి కరోనా ఉన్నట్లు చనిపోయిన తరువాత నిర్ధారణ అయింది. మిగిలిన అయిదుగురు కూడా కరోనాతోనే మరణించి ఉంటారని ప్రభుత్వం భావిస్తున్నది.

ఏపీలో కరోనా కట్టడికి డ్రోన్ల వినియోగం

వీరిద్వారా వైరస్‌ సోకే అవకాశం ఉన్నదని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, దవాఖానలకు తరలిస్తున్నాయి. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్యఆరోగ్యశాఖ కోరింది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలని, వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని వైద్యారోగ్యశాఖ విజ్ఞప్తిచేసింది.

21రోజుల తర్వాత లాక్‌డౌన్‌ పొడిగింపు అంతా పుకారు

ఇప్పటికే ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో రెండువేల మందిని క్వారంటైన్‌కు తరలించారు. నిజాముద్దీన్‌ ప్రాంతానికి చెందిన ఓ బృందంలోని 175 మందికి పలు దవాఖానల్లో సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీకి చెందిన 300 మందిని వివిధ దవాఖానలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మార్చి 15న ప్రార్థనలు పూర్తయినప్పటికీ.. 1400 మంది ఇంకా మసీదులోనే ఉండిపోయారు. వీరందరికీ కరోనా పరీక్షలు జరుపుతున్నారు.

ఏప్రిల్ 15 తర్వాత కూడా తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తేసే ఛాన్స్ లేదు

మర్కజ్‌ భవనంతో సహా నిజాముద్దీన్‌ ప్రాంతాన్ని ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకొన్నాయి. స్థానికుల కదలికలపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. చుట్టుపక్కల కాలనీల్లో ప్రతి ఇంటికీ వెళ్లి.. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్వారంటైన్‌లకు తరలిస్తున్నారు.

Here's ANI Tweet

ఇదిలా ఉంటే శ్రీనగర్‌కు చెందిన మతబోధకుడు గతవారం కరోనా వైరస్‌ వల్ల మరణించాడు. ఢిల్లీలో ప్రార్థనలకు హాజరైన తర్వాత అతడు ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌లో జరిగిన మత కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్లు తెలిసింది. మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొని తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు కూడా చనిపోయాడు.

తెలంగాణాలో తొలి కరోనావైరస్ మరణం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే షేక్‌ మహ్మద్‌ ముస్తఫాతోపాటు పదిమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముస్తఫా బంధువుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరికొందరు దేశంలోని పలు ప్రాంతాలకు తిరిగి వెళ్లడంతో వారి వల్ల ఇతరులకు వైరస్‌ వ్యాపించే అవకాశమున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కరోనా వైరస్‌తో మరొకరు మృతిచెందారు. కొత్తగా 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐసొలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నవారిలో 13 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటికే ఒకరిని డిశ్చార్జ్‌ చేయగా, మిగిలిన 61 మందికి వైద్యసేవలు అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.