Hyderabad, Mar 30: కోవిడ్-19 (COVID-19) నియంత్రణకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి విదితమే. ఇది ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇది తెలంగాణలో (Telangana Lockdown) ఆ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) స్పష్టం చేశారు. మనది చాలా పెద్ద దేశమని అంతా మంచిగా ఉన్న సమయంలో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందితే పరిస్థితి ఏంటని అన్నారు.
ఏప్రిల్ 7 తర్వాత కరోనా సమస్య ఉండదు
ముందు రాష్ట్రం, తర్వాత దేశం స్థిమిత పడాలి. ఆ విషయాన్ని మన వైద్య నిపుణులు చెబుతారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి తొందరగా బయటపడాలని అందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. బయటపడే వరకు అందరూ నియంత్రణ పాటించాలి. అది తప్ప మనకు మరో గత్యంతరం లేదని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.
తెలంగాణాలో తొలి కరోనావైరస్ మరణం
ఈ సందర్భంగా డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల సేవల కోసం సీఎస్ ప్రకటన జారీ చేశారు.100 మంది అవసరమైతే 130 మందిని సిద్ధం చేసుకోవాలి. వారి సేవలు అవసరమైనప్పుడు వారికి డబ్బులిస్తారు. 60 ఏళ్లలోపు వయసుగల సాంకేతిక అర్హతలున్న వారుఅందరూ అర్హులే.
Here's Telangana CM KCR press Meet
CM Sri K. Chandrashekar Rao addressing the Media on Lockdown situation in Telangana from Pragathi Bhavan. https://t.co/FwK5uuLV1v
— Telangana CMO (@TelanganaCMO) March 29, 2020
పీజీ చేసిన వారు, రిటైరైన డాక్టర్లు, ఎంబీబీఎస్ పాసైన వారిని విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. పరిస్థితి ఎంతవరకు వెళ్లినా ఎదుర్కొనే సత్తా మనకు ఉందని, రిటైరైన ఆర్మీ వాళ్లు.. సేవాభావం ఉన్న వాళ్లు ఈ విషయంలో ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.
తెలంగాణలో ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్
మార్చి 15 నుంచి ఆదాయం అంతా సున్నాలా ఉందని దాదాపు ఈపాటికి మనకు రూ. 12 వేల కోట్లు రావాలని అవి ఆగిపోయాయని అన్నారు. ఎక్సైజ్, పెట్రోల్, జీఎస్టీ అన్నీ బంద్ అయ్యాయని అన్నారు. ఎమ్మెల్యేల జీతాలు కూడా ఆపేసి పరిస్థితి ఉంటే దాన్ని కూడా ఆపేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కోత కోయాల్సి వస్తే కోస్తామని, దీనికి ఎవరూ అతీతులు కాదని తెలిపారు.
తెలంగాణ డీఎస్పీ నిర్లక్ష్యం, కొడుకు ద్వారా తండ్రికి, వంటమనిషికి కరోనా వైరస్
ఇది లగ్జరీ సమయం కాదు. సంక్షోభంలో ఉన్నాం. అందరూ తగ్గించుకోవాలి. రెండు బుక్కలకు బదులు ఒక బుక్కనే తినాలని తెలిపారు. రెండు నెలలో, మూడు నెలలో, నాలుగు నెలలో ఈ గండం గట్టెక్కే దాకా అందరూ ఊపిరి బిగపట్టుకొని కొంచెం నియంత్రణ పాటించాలి. అందరం రాజీపడితే ఈ సమాజం నడుస్తుందని అన్నారు. విరాళాల కోసం పిలుపు ఇవ్వాల్సిన అవసరం లేదు. గొప్పవాళ్లు వచ్చి ఇస్తున్నారని వారందరికీ శతకోటి దండాలు అని తెలిపారు.
కరోనాపై నిర్లక్ష్యం, కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు
విదేశాల నుంచి వచ్చిన వారికికానీ, వారితో కాంటాక్టు ఉన్నారనే అనుమానంతో కానీ, మొత్తం 25,937 మందిని ప్రభుత్వ వైద్య పర్యవేక్షణలో పెట్టుకొన్నామని అన్నారు. ఇందులో చాలామందికి క్వారంటైన్ సమయం పూర్తి కావస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5,746 బృందాలు నిరంతరం జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో వారిని పర్యవేక్షిస్తున్నాయి. ఫోన్‌ద్వారాగానీ, వ్యక్తిగతంగా వారి దగ్గరికి పోయి వారిని పర్యవేక్షిస్తున్నారు.
ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలి, ఏపీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలు
ఇప్పటికే 14,556 మంది క్వారంటైన్ పూర్తయింది. మిగిలినవారికి మార్చి 30 నుంచి వరుసగా క్వారంటైన్ పూర్తవుతుంది. దాని తర్వాత వారికి పర్యవేక్షణ అవసరంలేదు. ఏప్రిల్ ఏడోతేదీ వరకు వారందరి క్వారంటైన్ టైం అయిపోతుంది. అంటే మొత్తం జీరోకు వస్తుందని అన్నారు.
మార్చి 30న 1899 మందికి, 31 వ తేదీన 1440, ఏప్రిల్ 1నుంచి ఏడో తేదీ వరకు వరుసగా 1461, 1887, 1476, 1453, 914, 454, 397 మందికి క్వారంటైన్ సమయం ముగిసిపోతుంది. ఏప్రిల్ ఏడు తర్వాత మన దగ్గర కరోనాకు సంబంధించిన వ్యక్తి ఉండకపోవచ్చు. ఆ లోపు దవాఖానాలో చికిత్స పొందుతున్నవాళ్లల్లో 30 నుంచి 35 మంది వరకు డిశ్చార్జి అవుతారు. పది నుంచి పన్నెండు మంది మాత్రమే ఉంటారు. కొత్త కేసులు వచ్చి చేరకపోతే కరోనా దాదాపు పూర్తి స్థాయిలో నియంత్రణ అయ్యే అవకాశం ఉందని అన్నారు.
వలస కూలీలను ఎక్కడికక్కడే ఆపేయండి
ధాన్యం కొనడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. ఇంత కఠిన పరిస్థితిలో కూడా ధాన్యం సేకరణ కోసం సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు రూ. 25 వేల కోట్లు సమీకరించినామని అన్నారు. కార్పొరేషన్‌కు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమీకరించడం చరిత్రలో ఇదే తొలిసారి. మక్కల కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్‌కు రూ. 3,200 కోట్లు కలిపి రైతుల కోసం సుమారు రూ. 30 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిందని తెలంగాన సీఎం తెలిపారు.