Amaravati, Mar 31: దేశంలో కరోనావైరస్ (Coronavirus) ఆందోళనకరంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు దాని నియంత్రణకు పలు చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏపీ సర్కారు (AP government) మరో ముందడుగు వేసింది. . హోమ్ క్వారంటైన్‌లో (home quarantine) ఉన్న వారి కదలికలను గుర్తించడానికి కొత్తగా కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను (Covid Alerting Tracking System) తెరమీదికి తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) చేసింది.
ఏపీలో కరోనా కట్టడికి డ్రోన్ల వినియోగం
విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. దాన్ని బేఖాతర్ చేస్తూ తిరిగే వారిపై నిఘా ఉంచింది ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా హోమ్ క్వారంటైన్‌లో ఉండకుండా.. ఎక్కడెక్కడికి వెళ్లారనే విషయాన్ని స్పష్టంగా తెలిపేలా దీన్ని రూపొందించారు. ఈ కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ది చేసింది. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా విభాగం అధికారులు దీన్ని రూపొందించారు.
Here's ANI Tweet
Andhra Pradesh Govt to use a tool "Covid alerting tracking system" developed by State Disaster Management Authority to track over 25,000 people placed under home quarantine, by tracking the location of their numbers in realtime with help of telecom service providers. #Coronavirus pic.twitter.com/pRklLwcsOQ
— ANI (@ANI) March 30, 2020
ఒకేసారి 25 వేల మంది కదలికలను పసిగట్టే సామర్థ్యం ఈ సాఫ్ట్‌వేర్‌కు ఉంది. ఇప్పటిదాకా ఇలాంటి అత్యాధునిక వ్యవస్థ అంటూ ఏదీ ఇతర రాష్ట్రాల్లో లేదు. ఈ సిస్టంను హోమ్ క్వారంటైన్‌లో ఉంటోన్న వారి సెల్ ఫోన్ నంబర్‌కు అనుసంధానం చేస్తారు. వారు వినియోగించే ఈ సెల్‌ఫోన్ నంబర్‌ను ఆధారంగా చేసుకుని సెల్ టవర్, సర్వీసు ప్రొవైడర్ల ద్వారా హోమ్ క్వారంటైన్‌లో ఉన్న అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టడానికి దీని ద్వారా అవకాశం ఉంటుంది.
ఏప్రిల్ 14 వరకు శ్రీవారి దర్శనం రద్దు
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర 25 వేల మందికి సంబంధించిన అన్ని ఫోన్ నంబర్లు, డేటా వివరాలన్ని నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ నిఘాలో ఉన్న కరోనా వైరస్ అనుమానితుడు.. తన ఇంటి నుంచి వంద మీటర్ల పరిధిని దాటి వెళ్తే.. వెంటనే ఆ సమాచారం ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వెంటనే జిల్లా అధికారులకు చేరిపోతోంది. వెంటనే వారు ఆ అనుమానితుడికి ఫోన్ చేస్తారు. వెంటనే ఇంటికి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తారు. అదే సమయంలో- సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఈ సమాచారాన్ని చేరవేస్తారు. మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్, వీధి, ల్యాండ్ మార్క్.. ఇవన్నీ పోలీసులకు అందుతాయి.
ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలి, ఏపీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలు
దీంతో పాటుగా ఇంటి నుంచి బయటికి వచ్చిన తరువాత ఈ వంద మీటర్ల పరిధిలో ఆ అనుమానితుడు ఎక్కడెక్కడ తిరిగారనే సమాచారం కూడా జిల్లా అధికార యంత్రాంగానికి చేరుతుంది. అదే సమాచారాన్ని వారు పోలీస్ స్టేషన్‌కు అందజేస్తారు. ఈ మొబైల్ నంబర్‌కు సంబంధించిన ట్రాకింగ్ సమాచారం మొత్తాన్నీ తమకు అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలను జారీ చేసింది.
మాకు కుటుంబం ఉంది, సెలవులు లేకుండా మీకోసం కష్టపడుతున్నాం
ఏపీలో ఇప్పటివరకు 23 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కాగా కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారు ఏపీలో లేరు. ఈ వైరస్ బారిన పడిన తొలి పేషెంట్ కూడా కోలుకున్నాడు.ఏపీలో కరోనా వ్యాప్తిని సర్కారు సమర్థవంతంగా అడ్డుకుంటోంది. దీనికి కారణం దుర్భేధ్యమైన గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ అని చెప్పవచ్చు.
ఏపీలో ఉచితంగా రేషన్ సరుకులు, నెల సరుకులను ముందుగానే పంపిణీ చేస్తున్న ఏపీ సర్కారు
విదేశాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారిని ఈ టీం సరైన సమయంలో గుర్తించడం వల్లే ఆది సాధ్యపడిందని జగన్ సర్కార్ చెబుతోంది. ఆ వ్యవస్థ విజయవంతం కావడం వల్ల కేరళ వంటి రాష్ట్రాలు సైతం వలంటీర్ల నియామకానికి చర్యలు సైతం చేపట్టాయి.