New Delhi, March 31: దిల్లీలోని నిజాముద్దీన్ (Nizamuddin Markaz) ప్రాంతంలో ఇటీవల జరిగిన తబ్లిఘి జమాత్ (Tablighi Jamaat) కార్యక్రమం దేశంలో ఇప్పుడు అలజడులు రేపుతోంది. భారతదేశంలో కోవిడ్-19 (COVID 19 in India) కేసుల్లో ఒక్కసారిగా గణనీయమైన పెరుగుదల మరియు వ్యాప్తికి మూలం ఎక్కువగా ఈ మత ప్రచారానికి సంబంధించిన కార్యక్రమం నుంచే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో హాజరయ్యారు, తిరిగి అలాగే ఇళ్లకు చేరుకున్నారు. వీరంతా ఇలా ఎంతమందిని కలుసుకున్నారో అనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
ఈ కార్యక్రమానికి హాజరైన వందల మంది విదేశీయులు వీసా నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు తెలిసింది. వీరంతా టూరిస్ట్ వీసాతో ఇండియాకు వచ్చి మతపరమైన భావజాలంను ప్రచారం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటకే కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఉంది, అయినప్పటికీ 100 విదేశీ మత పెద్దలు వీరితో పాటుగా మరో 200 మంది కలిసి దిల్లీలోని సమావేశానికి హాజరయ్యారు. వస్తూ వస్తూ వారితో పాటుగా కరోనావైరస్ ను మోసుకొచ్చారు. అంతేకాకుండా ఆ సమావేశం అనంతరం ఈ విదేశీయులంతా బృందాలుగా విడిపోయి రైలు మార్గం, రోడ్డు మార్గాల ద్వారా వివిధ రాష్ట్రాలకు, అక్కడ్నించి వివిధ నగరాలకు చేరుకొని అక్కడ కూడా మసీదుల్లోకూడా ప్రచారం నిర్వహించారు.
ఈ సమావేశాని హాజరైన వారిని కొంత మందిని దిల్లీలో తాజాగా ట్రేస్ వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ఒక్కసారిగా కేసులు పెరగటానికి కారణం, తెలంగాణలో నమోదైన 6 కోవిడ్-19 మరణాలు ఈ సమావేశానికి హాజరైన వారు, వారి సంబంధీకులవే కావడం గమనార్హం. ఢిల్లీ మత ప్రార్థనల్లో కరోనావైరస్ కల్లోలం, ఆరుమంది మృతి, మర్కజ్ మౌలానాపై కేసు నమోదు
కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఇండోనేషియన్ బృందంలోని సభ్యులు దిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ద్వారా తెలంగాణలోని సిర్పూర్ కాగజ్ నగర్, రామగుండం ప్రాంతాల గుండా ప్రయాణించి కరీంనగర్ చేరుకున్నారు. వీరితో పాటు ప్రయాణించిన ఇతర ప్రయాణికులు కాజీపేట్, సికింద్రాబాద్ గుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు.
ఇక కరీంనగర్ లో ఆ బృందం నిర్వహించిన మత ప్రచారానికి నిజామాబాద్, నిర్మల్, భైంసా తదితర పట్టణాల నుంచి కూడా జనం హాజరైనట్లు తెలిసింది. ఇప్పుడు వీరందరినీ ట్రేస్ చేసే పనిలో ప్రభుత్వం ఉంది.
ఇలా వీసా నిబంధనలు ఉల్లంఘించి, వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన ఈ 300 మంది విదేశీయులను బ్లాక్ లిస్టులో చేర్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.
భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య
మంగళవారం నాటికి 1,251 కు చేరుకుంది, మరణాల సంఖ్య 42 కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి బారిన పడినవారి సంఖ 786,000 దాటింది మరియు 37,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఇటలీలో 11,500 పైగా మరణాలు నమోదయ్యాయి, తరువాత స్పెయిన్‌లో 7,700 మందికి పైగా మరణించారు, చైనాలో 3,300 మంది మరియు యునైటెడ్ స్టేట్స్‌లో 3,100 మందికి పైగా మరణించారు.