Andhra Pradesh: హిందూ మత వ్యాప్తి కోసం జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం, 26 జిల్లాల్లో 3000 హిందూ దేవాలయాల నిర్మాణం, హిందూ మతాన్ని విశ్వ వ్యాప్తం చేయడమే లక్ష్యంగా కార్యక్రమం

రాష్ట్రంలో పుణ్యక్షేత్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం (Andhra Pradesh Govt) పెద్దఎత్తున చేపట్టింది.

YS Jagan meets PM Modi (Photo-ANI)

దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో కనీసం ఒక హిందూ మత విశ్వాసానికి సంబంధించిన ఒక ప్రధాన మందిరమైనా ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో పుణ్యక్షేత్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం (Andhra Pradesh Govt) పెద్దఎత్తున చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 'హిందూ విశ్వాసాన్ని పరిరక్షించడం, ప్రచారం చేయడం' లక్ష్యంగా (protect and propagate Hindu faith) ఈ కార్యక్రమం చేపట్టామని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా 26 జిల్లాల్లో 3000 హిందూ దేవాలయాల నిర్మాణం (build 3,000 temples Across 26 Districts) చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఏపీలో కొత్తగా మరో ఆరు మండలాలు, ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తూ నోటిఫికేషన్, నెలలోగా అభ్యంతరాలను తెలపాలని సూచన

హిందూ విశ్వాసాన్ని రక్షించేందుకు, ప్రచారం చేసేందుకు బడుగు బలహీన వర్గాల ప్రాంతాల్లో హిందూ దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ మంగళవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించడానికి ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శ్రీ వాణి ట్రస్ట్, ఆలయాల నిర్మాణానికి ఒక్కొక్కరికి ₹ 10 లక్షలు కేటాయించింది.

దటీజ్ సీఎం జగన్, కిడ్నీలు పాడైన ఆ ఇద్దరి బాధితులకు రూ. 25 లక్షలు సాయం, సీఎంఆర్‌ఎఫ్‌ కింద విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు

1,330 ఆలయాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. ఈ జాబితాలో మరో 1,465 ఆలయాలను చేర్చింది. అదే సమయంలో, వ్యక్తిగత శాసనసభ్యుల అభ్యర్థనలను బట్టి, రాష్ట్రంలో మరో 200 దేవాలయాలు నిర్మించబడతాయి. ఇటీవల జోడించిన దేవాలయాలు, వ్యక్తిగత శాసనసభ్యులు కోరిన ఆలయాల నిర్మాణం "స్వచ్ఛంద సంస్థల" సహకారంతో జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్పారు.దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 978 ఆలయాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

ఆలయాల పునరుద్ధరణకు, ఆలయాల్లో ఆచార వ్యవహారాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ₹270 కోట్లు (INR 2.7 బిలియన్లు) కేటాయించింది. ఈ కేటాయించిన నిధులలో, ₹238 కోట్లు (INR 2.38 బిలియన్లు) ఇప్పటికే విడుదలయ్యాయి.



సంబంధిత వార్తలు

AP Cabinet Meeting Highlights: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, జల్ జీవన్ మిషన్ పథకం ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు

Cyclone Fengal Update: తమిళనాడులో ఫెంగల్ తుఫాను విధ్వంసం, రూ. 2వేల కోట్లు మధ్యంతర సాయం ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ, వచ్చే మూడు రోజుల పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్ష సూచన

Love Betrayal in MP: చనిపోదామని నిర్ణయించుకున్న ప్రేమికులు, ప్రియురాలిని తుపాకీతో కాల్చిన తరువాత మనసు మార్చుకున్న ప్రియుడు, చివరకు ఏమైందంటే..

Cyclone Fengal Update: తీరం దాటినా కొనసాగుతున్న ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్, నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులకు కీలక అలర్ట్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif