AP High Court Suspends G.O. No.1: జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ, జీవో నెంబర్ 1ను కొట్టేసిన ధర్మాసనం, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని వెల్లడి

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది.

Credits: Wikimedia Commons

జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది. ఇక, రాష్ట్రంలో సభలు, రోడ్‌ షోలు ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోను సవాలు చేస్తూ విపక్షాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో విచారణ జరిపిన హైకోర్టు ఈ జీవోను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రహదారులపైనా, కూడళ్లలోనూ సభలు, సమావేశాలు, రోడ్ షోలు పెట్టకూడదంటూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 2న ఈ జీవోను తీసుకొచ్చింది. ర్యాలీలు, సభలకు పోలీసుల అనుమతి కచ్చితంగా ఉండాల్సిందేనని, వీటి పూర్తి వివరాలను పోలీసులకు ఇవ్వాలని జీవో పేర్కొంటోంది.

ఓ వైపు వానలు మరోవైపు ఎండలు.. ఏపీలో భిన్న వాతావరణం.. మూడు రోజులపాటు ఇలాగే.. 60 మండలాల్లో నేడు వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు.. ఈ నెల 14న తీరం దాటనున్న ‘మోచా’ తుపాను

ఈ క్రమంలో, ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేత కొల్లు రవీంద్ర, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఐఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. పోలీస్ యాక్ట్ 30కి భిన్నంగా ఈ జీవో ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందని... ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఈ జీవోను తీసుకొచ్చారని కోర్టుకు తెలిపారు.

ఈ పిటిషన్లను జనవరి 24న హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును వెలువరిస్తున్న సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ... ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా జీవో నెంబర్ 1 ఉందని వ్యాఖ్యానించింది. జీవో నెంబర్ 1ని సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif