Andhra pradesh Shocker: అక్రమ సంబంధం అనుమానం, కిరాతకంగా భార్యను చంపిన భర్త, నిడదవోలులో విషాదం
కట్టుకున్న భార్యను దారుణంగా చంపేశాడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కరుసాల చిరంజీవివి పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది.వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Andhra pradesh, July 21: వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ తాపీ మేస్త్రీ దారుణానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యను దారుణంగా చంపేశాడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కరుసాల చిరంజీవివి పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది.వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
తాపీ మేస్త్రి పని చేసే చిరంజీవి, కొంతకాలంగా భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు. వేరే వ్యక్తితో అక్రయ సంబంధం ఉందని తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యా,భర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో భార్యను హత్య చేశాడు చిరంజీవి.
నవ్య తండ్రి నిడదవోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు కుమార్తెలకు తల్లి లేకుండా చేసిన చిరంజీవిపై అందరి మండిపడుతుండగా ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనుమానం పెనుభూతమై, భార్యను - 10నెలల పసికందును చంపిన కసాయి.. చివరికి తాను కూడా?