Secundrabad, July 21: ఓ కసాయి తండ్రి. చివరికి తాను కూడా ఆత్మహత్య చేసుకుని రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చాడు.
సికింద్రాబాద్ బోయినపల్లిలో గణేష్ తన భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. వీరికి పది నెలల కొడుకు కూడా ఉన్నాడు.చక్కగా సాగుతున్న వీరి సంసారంలో అనుమానం అనే పెనుభూతం ఎంటరైంది. రోజురోజుకు భార్యపూ అనుమానాన్ని పెంచుకున్న గణేష్ చివరకు తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు.
తొలుత భార్యను ఆ తర్వాత ఇంట్లో ఉన్న పదినెలల పసికందును చంపాడు. వీరిద్దరిని చంపిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అల్వాల్ రైల్వే ట్రాక్ పై నిలబడి పోలీసులకు ఫోన్ చేశాడు గణేష్. భార్య, పిల్లాడిని పంచేశానని, తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పాడు. గణేష్ మృతదేహాన్ని రైల్వే పట్టాలపై గుర్తించగా భార్య, చిన్న పిల్లాడి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో మిగితా ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని రేపగా నాలుగు నెలల క్రితమే వీరు మహారాష్ట్ర నుండి వచ్చి బోయిన్‌పల్లిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అచ్చంపేటలో దారుణం, మద్యం తాగించి ఇద్దరు మహిళలపై అత్యాచారం, కారులోనే లైంగిక దాడి