Pulivendula Illegal Liquor Mafia: కారుతో ఢీకొట్టినా వదలని పులివెందుల ఎస్ఐ‌, కడప జిల్లాలో మద్యం అక్రమ రవాణాని అడ్డుకున్న ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి, 80 మద్యం బాటిల్స్‌ స్వాధీనం, కేసు నమోదు, హిందూపూర్‌లో రెచ్చిపోయిన మద్యం మాఫియా

అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని పులివెందుల ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి (pulivendula SI gopinath reddy) చాకచక్యంగా పట్టుకున్నారు. మద్యం మాఫియా కారుతో ఆయన్ని ఢీకొట్టినా సరే పోరాడారు. వివరాల్లోకెళితే.. పులివెందులలోని రాఘవేంద్ర థియేటర్‌ సమీపంలో రోడ్డు పక్కన ఆపిఉన్న ఓ వాహనంలో అక్రమ మద్యం (Andhra Pradesh Illegal liquor) ఉన్నట్లు ఎస్ఐకి సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో అక్కడకు చేరుకుని వాహనాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వాహనంలో ఉన్నవారు కారును ముందుకు, వెనక్కి నడుపుతూ వేగంగా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.

SI Caught for smuggling liquor illegally At Pulivendula kadapa (Photo-Video grab and Twitter)

Amaravati, August 29: వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో మద్యం అక్రమ రవాణాను (Pulivendula Liquor Mafia) అడ్డుకునేందుకు ఓ ఎస్సై ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని పులివెందుల ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి (pulivendula SI gopinath reddy) చాకచక్యంగా పట్టుకున్నారు. మద్యం మాఫియా కారుతో ఆయన్ని ఢీకొట్టినా సరే పోరాడారు.

వివరాల్లోకెళితే.. పులివెందులలోని రాఘవేంద్ర థియేటర్‌ సమీపంలో రోడ్డు పక్కన ఆపిఉన్న ఓ వాహనంలో అక్రమ మద్యం (Andhra Pradesh Illegal liquor) ఉన్నట్లు ఎస్ఐకి సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో అక్కడకు చేరుకుని వాహనాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వాహనంలో ఉన్నవారు కారును ముందుకు, వెనక్కి నడుపుతూ వేగంగా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో ఎస్‌ఐ కారు పైకి ఎక్కి గట్టిగా పట్టుకునేందుకు యత్నించినా, కారులో ఉన్న దుండగులు మాత్రం ఆగకుండా రెండు కిలోమీటర్లు వరకూ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. అయినా ఎస్‌ఐ గోపీనాథ్‌ రెడ్డి ఏమాత్రం పట్టు సడలకుండా కారు ముందు భాగంవైపు అద్దాన్ని పట్టుకునే ఉన్నారు. మరోవైపు ఇంకో పోలీసు వాహనంలో అక్కడకు చేరుకున్న సిబ్బంది మద్యం ముఠాను అదుపులోకి తీసుకుంది.

Here's Video

ఈ ఘటనపై ఎస్‌ఐ ధైర్యానికి ప్రశంసలు కురుస్తున్నాయి. దుండగుల్ని అదుపులోకి తీసుకుని, 80 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. దళిత యువకుడికి శిరోముండనం, నూతన నాయుడు భార్యతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు

ఇదిలా ఉంటే హిందూపురంలో (hindupur) మద్యం మాఫియా రెచ్చిపోయింది. మద్యం అక్రమ విక్రయాలను అడ్డుకున్న ఎక్సైజ్‌ ఎస్సై సరోజతో సహా ముగ్గురు కానిస్టేబుళ్లపై మద్యం వ్యాపారులు దాడి చేశారు. కర్నాటక మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై సరోజ ముగ్గురు కానిస్టేబుళ్లతో బోయపేటకు వెళ్లారు. పోలీసులను చూసిన మద్యం మాఫియా వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఎస్సై సరోజ ఫోన్‌ను లాక్కుని దాడికి దిగారు. ఈ దాడిలో ఎస్సైతో సహా ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో బోయపేటకు చెందిన రామాంజి, లక్ష్మినారాయణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.