Dalit youth Tonsured Case (Photo-Video Grab)

Visakhapatnam, August 29: పరాన్నజీవి దర్శకుడు నూతన్‌ కుమార్‌ నాయుడు ఇంట్లో కర్రి శ్రీకాంత్‌ అనే దళిత యువకుడికి ఘోర అవమానం (Dalit youth Tonsured Case) జరిగింది. తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్‌ నాయుడు (Filmmaker Nutan Naidu) భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. వెస్ట్‌ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ విభాగం ఏసీపీ త్రినాథ్‌ పెందుర్తి పీఎస్‌కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు.

దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు (Pendurthi police) కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం (Dalit youth 'beaten, tonsured) జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నూతన్‌ నాయుడు భార్యతో పాటు మిగతావారిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెస్ట్‌ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ ఎస్టీ విభాగం ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి.

Here's Video

చెప్పకుండా పని మానేశాడన్న కోపంతో కర్రి శ్రీకాంత్‌ (Karri Srikanth) అనే యువకుడిపై ఈ నూతన నాయుడు కుటుంబం పాల్పడింది. ఆగస్టు 28 మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని శ్రీకాంత్‌ను పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేసి కొట్టడమే కాకుండా జుట్టు తొలగించేశారు. దీంతో అతను తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. అసలేం జరిగింది? దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లో శిరోముండనం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం, ఎస్సై,ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్

ఈ కేసులో A1గా ఉన్న నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, ఝూన్సీ, సౌజన్య, బాలు, రవిపై సెక్షన్ 307, 342, 324, 323, 506, ఆర్‌డబ్ల్యూ 34 ఐపీసీ 3(1)(ఈ).3(2)(వీ), ఎస్సీ, ఎస్టీ, పీఓఏ యాక్ట్ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. ఘటనను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ చెప్పారు. తననేమైనా చేస్తారని భయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితుడు కర్రి శ్రీకాంత్‌కోరాడు. శిరోముండనం చేసిన ఎస్ఐ అరెస్ట్, దళిత యువకుడిపై అమానుష దాడి, ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

నూతన్‌ కుమార్‌ నాయుడు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పెందుర్తి ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేశారు. గతేడాది ఓ చానల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్‌ షోలో పాత్రధారి. ఇటీవల విడుదలైన పరాన్నజీవి చిత్రానికి దర్శకుడు. విశాఖ నగర మాజీ మేయర్ గా పనిచేశారు.