Dalit Youth Tonsured Incident (Photo-Twitter)

Amaravati,July 22: ఏపీలో దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లో శిరోముండరం చేయడంపై (Dalit Youth Tonsured Incident) తీవ్ర దుమారం రేగుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్టేషన్‌లో (Seethanagaram police station) దళిత యువకుడికి స్టేషన్ ఎస్ఐ కొట్టడమే కాకుండా జుట్టు, మీసాలు (Dalit youth allegedly beaten, tonsured) తొలగించారు.

గాయపడిన బాధితుడిని రాజ మహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇసుక లారీలను అడ్డుకున్నందుకే తనపై దాడి చేశారని బాధితుడు చెప్పాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో ఢీ కొట్టినట్లు ఆరోపించాడు. రాజీవ్ గాంధీ హత్యకేసు దోషి నళిని శ్రీహరన్‌ ఆత్మహత్యాయత్నం, 29 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న నళిని

వివరాల్లోకెళితే.. ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం స్టేషన్ పరిధిలోని మునికూడలి అనే గ్రామం దగ్గర ఇటీవలే ఇసుకలారీ ప్రమాదం జరిగింది. ఆ లారీ ప్రమాదం విషయమై స్థానిక యువకులు, లారీ నిర్వాహకుల మధ్య గొడవ అయింది. దీంతో ఆ లారీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Here's AP CMO Tweet

నిర్వాహకులు ఫిర్యాదుతో సీతానగరం పోలీసులు వెండుగమిల్లి ప్రసాద్ అనే వ్యక్తిని స్టేషన్‌కి తీసుకు వచ్చారు. అతను ఆ కేసులో ఏ2గా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ప్రసాద్‌ను గట్టిగా కొట్టడమే కాకుండా ట్రిమ్మర్‌తో అతని జుట్టు బాగా కత్తిరించి, గుండులాగా చేశారు. గడ్డం కూడా తీసేసారు. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ప్రస్తుతం బాధితుడు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Here's TDP Chief N Chandrababu Naidu Tweet

ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటున్న సీతానగరం ఇన్‌చార్జి ఎస్సై షేక్ ఫిరోజ్, ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి అర్బన్ ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్ తెలిపారు. కాగా ఇప్పటికే ఎస్సైను సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టినట్లు ఎస్పీ చెప్పారు. నిందిత ఎస్సై గోకవరం స్టేషన్లో అడిషనల్ ఎస్సైగా ఉన్నారు. సీతానగరం పోస్టు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు.

సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఏపీ సీఎం

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో దళిత యువకుడి ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌‌మోహన్ రెడ్డి స్పందించారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎంఓ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్న జగన్ బాధ్యులైన సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీలో తాజాగా 4,994 కరోనా కేసులు నమోదు, ఒక్కరోజులో 62 మంది మృత్యువాత, రాష్ట్రంలో 58,668కి చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య

ఇలాంటి ఘటనలు ఎట్టిపరిస్థితుల్లోనూ చోటు చేసుకోరాదని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు స్పందించిన డీజీపీ.. ఈ కేసుపై విచారణ జరిపి ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలుంటాయని డీజీపీ తెలిపారు.

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ 

ఈ ఘటనపై డీజీపీ గౌతం సవాంగ్ (DGP Gautam Sawang) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించిన ఆయన.. ఇలాంటి వ్యవహారశైలిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఎస్సై, సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటూ ఐపిసి 324,323,506, r/w 34 కింద కేసులు (క్రైం నంబర్ 257/2020) పెట్టారు.

దళిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది: చంద్రబాబు

ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న దళిత యువకుడికి శిరోముండనం రాష్ట్రంలో వైసీసీ పైశాచికాలకు పరాకాష్ట. తూర్పుగోదావరి జిల్లా వెదుళ్లపల్లి దళిత యువకుడు వరప్రసాద్ పై జరిగిన ఈ రాక్షస చర్యను ఖండిస్తున్నాం. ఇది యావత్ దళిత జాతిపై దాడి.. ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం..వైసీపీ దళిత వ్యతిరేక పార్టీ అనడానికి ఇవే ప్రత్యక్ష సాక్ష్యాలు. దళిత సంఘాలు, ప్రజా సంఘాలన్నీ ఏకమై ఈ దాడులను ప్రతిఘటించాలి. బాధిత దళిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగేదాకా, నిందితులను కఠినంగా శిక్షించేదాకా రాజీలేని పోరాటం చేస్తాం'' అని చంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి: మాజీ ఎంపీ 

దళిత యువకుడిపై తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని మాజీ ఎంపీ హర్షకుమార్ (GV Harsha Kumar) మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ లోనే గుండు కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎస్పీ, డీఎస్పీ, సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేత కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని... లేనిపక్షంలో ఏం చేస్తామో చేసి చూపిస్తామని హెచ్చరించారు.

స్థానిక వైసీపీ నాయకుడి ఫిర్యాదుతో అతడిని అదుపులోకి తీసుకొని బెల్ట్‌తో కొట్టారని.. అనంతరం శిరోముండనం చేశారని బాధితుడు తెలిపాడు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను ఆపినందుకే తనపై దాడి చేశారని వాపోయాడు. కాగా పోలీసు తీరును నిరసిస్తూ పలు చోట్ల ఎస్సీ,ఎస్టీ సంఘాలు ఆందోళనలు చేశాయి. పోలీసులపై కఠిన చర్యలు తీసుకొని.. వరప్రసాద్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.