Granules Investments in AP: ఏపీలో మరో కంపెనీ రూ. 2000 వేల కోట్ల పెట్టుబడులు, కాకినాడ వద్ద భారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్న ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్‌

పలు కంపెనీలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్‌ (Granules) ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద భారీ ప్లాంటును (Kakinada Green Plant) ఏర్పాటు చేయనుంది.

Granules (Photo-Google wiki)

Amaravati, Jan 4: సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీలో పెట్టుబడులు దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. పలు కంపెనీలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్‌ (Granules) ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద భారీ ప్లాంటును (Kakinada Green Plant) ఏర్పాటు చేయనుంది. వచ్చే అయిదేళ్లలో ఈ కేంద్రానికి కంపెనీ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో దశలవారీగా ఈ ఫెసిలిటీ కార్యరూపం దాల్చనుంది.

పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.20,744 కోట్లు ఖర్చు, వార్షిక నివేదికలో పేర్కొన్న కేంద్ర జలశక్తి శాఖ,ఇప్పటిదాకా రూ.13,226.04 కోట్లు విడుదల చేసిన కేంద్రం

ఔషధాల ఉత్పత్తికి కావాల్సిన కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్, ఇంటర్మీడియేట్స్, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్, ఫెర్మెంటేషన్‌ ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు. కాగా, గ్రాన్యూల్స్‌ తాజాగా గ్రీన్‌కో జీరోసీతో భాగస్వామ్యం (Rs 2,000 Crore Partnership With Greenk) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉద్గార రహిత విద్యుత్‌ను గ్రీన్‌కో ఈ ప్లాంటుకు సరఫరా చేస్తుంది.

మీకిచ్చిన హామీని మీ బిడ్డ నిలబెట్టుకున్నాడు, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాలను గమనించాలని పిలుపునిచ్చిన సీఎం జగన్, రాజమండ్రి టూర్ లైవ్ అప్ డేట్స్ ఇవే..

అలాగే డీసీడీఏ, పీఏపీ, పారాసీటమాల్, మెట్‌ఫార్మిన్, ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్‌ తయారీలో వాడే రసాయనాలను సైతం అందిస్తుంది. గ్రాన్యూల్స్‌ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి, గ్రీన్‌కో గ్రూప్‌ ఫౌండర్‌ మహేశ్‌ కొల్లి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.