KA Paul on Pawan Kalyan: తన కొడుకు లోకేష్‌ను కాదని నిన్ను సీఎం ఎలా చేస్తారు పవన్, నీకు అసలు బుర్ర ఉందా, జనసేనాధినేతపై మండిపడిన కెఏ పాల్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు (KA Pal on Pawan Kalyan) చేశారు. అసలు పవన్‌కు బుర్ర ఉందా? తన ఓటమికి ప్రజలే కారణమంటూ పవన్‌ మాట్లాడటం అనేది తెలివి తక్కువతనం అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.

KA Paul (Photo-Video Grab)

Amaravati, Jan 16: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు (KA Pal on Pawan Kalyan) చేశారు. అసలు పవన్‌కు బుర్ర ఉందా? తన ఓటమికి ప్రజలే కారణమంటూ పవన్‌ మాట్లాడటం అనేది తెలివి తక్కువతనం అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. పాల్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నీకు ఓట్లు వేయకపోతే ప్రజలును తిట్టేస్తావా?. ఎన్నికల్లో ఓడిస్తున్నారనే కారణంతో టీడీపీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పడం ఎంత వరకు కరెక్ట్‌. ముఖ్యమంత్రిని చెయ్యాలనే కండిషన్‌తో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటానని చెప్పడం పెద్ద తప్పు. నీకు పదవులు ఇస్తామని హామీ ఇస్తే ఎవరి పార్టీలోకి అయినా వెళ్లిపోతావా?. కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవి ఇస్తామని ఏ పార్టీ అయినా చెబితే వారికే సపోర్ట్‌ చేస్తావా?.

నాగబాబుకు పంచ్ రిప్లై ఇచ్చిన అంబటి రాంబాబు, పోలవరం పూర్తి చేసి మీ అన్నాదమ్ముళ్ల చేత డ్యాన్స్ వేయిస్తామంటూ ట్వీట్

చంద్రబాబు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తానంటే ఎలా నమ్మావు. తన కొడుకు లోకేష్‌ను కాదని నిన్ను ముఖ్యమంత్రిని ఎలా చేస్తాడు. కనీస జ్ఞానం ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు తెలివి తేటలను ఇచ్చాడని, దాని వాడాలని కేఏ పాల్.. పవన్‌ కు సూచించారు. ప్రజలను మోసం చేయడానికే పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ప్రజలు తెలివైనా వారు నిన్ను అసలు గెలిపించరు అంటూ విమర్శలు KA Paul చేశారు.

అనకాపల్లిలో ఓ వ్యకిని ముక్కలు ముక్కలుగా నరికిన గుర్తు తెలియని వ్యక్తులు, దుండగులు తల, మొండెం, కాళ్లను వేర్వేరుగా పడేసిన కిరాతకులు

సందుల్లో మీటింగ్స్‌ పెట్టకండి.. బహిరంగ సభలు బహిరంగంగానే మీటింగ్‌లు పెట్టండి అని అన్నాను. అందులో తప్పేముంది. జనం ఎక్కువ సంఖ్యలో వచ్చారని చూపించడానికే చంద్రబాబు ఇలా చేస్తున్నాడు. చంద్రబాబు చేసింది తప్పు. చంద్రబాబు సభల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి కంగ్రాట్స్‌ చెబుతున్నాను. వాళ్లు చేసింది కరెక్ట్‌ అంటూ ప్రశంసించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement