Andhra Pradesh: యువతిని 15 సార్లు పొడిచి చంపిన కేసు, ప్రేమోన్మాదికి యావజ్జీవ కారాగారశిక్ష విధించిన కాకినాడ కోర్టు, 138 రోజుల్లో ఈ కేసు విచారణ పూర్తి చేసిన కాకినాడ పోలీసులు

138 రోజుల్లోఈ కేసు విచారణ పూర్తి చేశారు.

nmates Escape From Juvenile Home Representational Image. | (Photo Credits: Pixabay)

కాకినాడ జిల్లాలో యువతిని దారుణంగా హత్య చేసిన (chopped woman ) ప్రేమోన్మాదికి కాకినాడ కోర్టు (kakinada court) జీవిత ఖైదుతో పాటు జరినామా విధించింది.సీఎం జగన్‌ ఆదేశాలతో విచారణ చేపట్టిన కాకినాడ పోలీసులు యువతిని నరికిన నిందితుడ్ని అరెస్ట్‌ చేసి చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 138 రోజుల్లోఈ కేసు విచారణ పూర్తి చేశారు. దేవికా మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించిన సంగతి విదితమే. తాజాగా కోర్టు ప్రేమోన్మాదికి జీవితకాలపు శిక్షను (sentenced life imprisonment) విధించింది.

కాకినాడ యువతి హత్య కేసులో షాకింగ్ రిపోర్ట్, అత్యంత క్రూరంగా 15 చోట్ల కత్తితో పొడిచిన ప్రేమోన్మాది, రెండువైపులా నరకడంతో పూర్తిగా తెగిపోయిన మెడలోని రక్తనాళాలు

కేసు ఇదే : ఏపీలోని కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల సమీపంలో తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో పట్టపగలు యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు ప్రేమోన్మాది.స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరానికి చెందిన కాదా రాంబాబు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన కుమార్తె దేవిక(21) కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలోని అమ్మమ్మ.. కొప్పిశెట్టి చంద్రమ్మ ఇంటి వద్ద ఉంటూ కాకినాడ పీఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది.

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలవరం గ్రామానికి చెందిన గుబ్బల వెంకటసూర్యనారాయణ కూరాడలోని మేనమామ ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. కొంతకాలంగా దేవిక వెంటపడుతూ తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక దేవిక ఈ విషయాన్ని బంధువులకు, పెద్దలకు చెప్పడంతో వారు యువకుడిని మందలించారు. అతడి మేనమామ కూడా యువకుడిని మందలించి ఏదైనా పనిచేసుకోవాలంటూ హైదరాబాద్‌కు పంపారు.

వరంగల్ జిల్లాలో వేధింపులతో మరొక విద్యార్థిని ఆత్మహత్య, గతంలో దిగిన చిత్రాలతో బెదిరింపులకు దిగిన స్నేహితుడు, తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న ఇంజనీరింగ్ స్టూడెంట్

కాగా, మళ్లీ అతను ఇక్కడికొచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం దేవిక కరపలోని ఓ షాపులో వస్తువులు తీసుకుని తిరిగి కూరాడకు బైక్‌పై బయలు దేరింది. పెదపూడి మండలం కాండ్రేగుల, కూరాడ గ్రామాల మధ్యలో ఆమె బైక్‌ను వెంకటసూర్యనారాయణ ఆపి.. తన బ్యాగ్‌లోంచి కత్తి తీసి దేవికను అత్యంత కిరాతకంగా నరికివేశాడు. ఆ రోడ్డు పరిసర పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీలు వచ్చి నిందితుడిని పట్టుకుని.. చెట్టుకు కట్టేసి కొట్టారు.

సమాచారం తెలుసుకున్న కాకినాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్, పెదపూ డి ఎస్‌ఐ వాసులు ఘటన స్థలానికి చేరుకుని.. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న దేవికను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఆమె శరీరంపై 48 కత్తి పోట్లున్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.