IPL Auction 2025 Live

Covid in Andhra: ఏపీలో కొత్తగా 2,620 కేసులు నమోదు, 7,504 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌, ఏపీలో ప్రస్తుతం 58,140 యాక్టివ్‌ కేసులు, రికార్డు స్థాయిలో వ్యాక్సిన్‌ వేసిన సిబ్బందికి అభినందనలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 44 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,363 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 7,504 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 17 లక్షల 82 వేల 680 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

2020 Coronavirus Pandemic in India (photo-Ians)

Amaravati, June 21: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 44 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,363 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 7,504 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 17 లక్షల 82 వేల 680 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 58,140 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,12,05,849 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

చిత్తూరు జిల్లాలో 10 మంది, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అలాగే కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.

కరోనా వైరస్‌ నివారణ చర్యలు, హెల్త్ నాడు-నేడుపై ముఖ్యమంత్రి వెఎస్‌ జగన్‌మహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్‌ వేసిన సిబ్బందికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే వేసే సమర్ధత ఉందని నిరూపించారని పేర్కొన్నారు. పటిష్ట యంత్రాంగంతో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ సాధ్యమైందని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బిల్డింగ్, నాన్‌ బిల్డింగ్ సర్వీసులపై అధికారులు సీఎం జగన్‌కు అధ్యయన వివరాలు తెలియజేశారు. ఆస్పత్రుల ఆవరణ కూడా అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, ఆస్పత్రుల నిర్వహణపై ఎస్‌ఓపీలను రూపొందించాలన్నారు. ప్రభుత్వాస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడాలని, ఎక్కడా ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్లాన్ కూడా సమర్ధవంతంగా ఉండాలని, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ప్రొటోకాల్స్‌పై అధ్యయనం చేయాలన్నారు. అన్ని అంశాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డును సాధించింది. గతంలో ఒకేరోజు 6.32 లక్షల డోసులు టీకాలు వేసి దేశంలోనే రికార్డు సృష్టించగా ఆదివారం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సిన్‌ డ్రైవ్‌ అంచనాలకు అందని రీతిలో విజయవంతమైంది. తాజాగా ఒక్కరోజే 13,59,300 మందికి టీకాలు వేశారు. దీంతో ఒకేరోజు ఎక్కువ సంఖ్యలో టీకాలు ఇవ్వడంలో ఏపీ తన రికార్డును తానే అధిగమించింది.



సంబంధిత వార్తలు

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Sambhal Shahi Jama Masjid Survey: యూపీలో మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై రాళ్లు రువ్విన స్థానికులు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, వీడియోలు ఇవిగో..