AP Shocker: ఇదేమి గొంతు కోయడాలు బాబోయ్, ఏపీలో యువతి గొంతు కోసిన ఉన్మాది, మేనమామే సూత్రధారి, అనకాపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి..

జిల్లాలోని వి.మాడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. నగేశ్‌ అనే యువకుడు బ్లేడ్‌తో యువతి గొంతుకోసి పరారయ్యాడు . దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి.

Representational Image | (Photo Credits: IANS)

Amaravati, April 25: ఏపీలో అనకాపల్లి జిల్లాలో ఓ ఉన్మాది యువతి గొంతుకోసి (Man slits throat girl) తీవ్రంగా గాయపరిచాడు. జిల్లాలోని వి.మాడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. నగేశ్‌ అనే యువకుడు బ్లేడ్‌తో యువతి గొంతుకోసి పరారయ్యాడు . దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి.

అనకాపల్లి జిల్లాలోని జి. మాడుగుల మండలంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద Swathi అనే యువతి గొంతు కోశాడు Nagesh అనే యువకుడు. యువతి బంధువులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. గతంలో రెండు సార్లు యువతినిపై నిందితుడు బెదిరించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కూతురిపై యువకుడి దాడి వెనుక తన సోదరుడి ప్రమేయం ఉందని బాధితురాలి తల్లి ఆరోపిస్తుంది.

యువతి మేనమామ Konda Babu ఈ దాడికి సూత్రధారి అని బాధితురాలి తల్లి ఆరోపణలు చేస్తుంది. స్వాతి తల్లికి వారసత్వంగా వచ్చే ఆస్తి విషయమై సోదరుడు కొండబాబుతో ఉన్న విబేధాల కారణంగా ఈ దాడికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్వాతిని హత్య చేస్తే నగేష్ కు లక్ష రూపాయాలు ఇస్తానని ఒప్పందం చేసుకొన్నాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. గతంలో కూడా తమ కూతురిపై దాడి జరిగిన సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా స్వాతి తల్లి చెబుతుంది. స్వాతిపై దాడి చేసిన తర్వాత నగేష్ పారిపోయాడు. నగేష్ తో పాటు కొండబాబు కూడా పారిపోయినట్టుగా సమాచారం. బాధిత కుటుంబం పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు నగేష్, కొండబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హన్మకొండలో మరో పుష్ప, భర్త నిద్రిస్తుండగా బ్లేడుతో గొంతు కోసిన భార్య, వరంగల్‌లో పెళ్లైన నెలకే దారుణ ఘటన

ఇక అనకాపల్లి జిల్లాలోని రావికమతంలో కాబోయే భర్త రామునాయుడు గొంతు కోసింది యువతి పుష్ప. ఈ ఘటన ఈ నెల 18న చోటు చేసుకొంది. పాడేరుకు చెందిన రాము నాయుడికి రావికమతం గ్రామానికి చెందిన పుష్పకు మే మాసంలో వివాహం జరిపించాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయం తీసుకొన్నారు.ఈ నెల 4 వ తేదీన నిశ్చితార్ధం కూడా చేశారు. అయితే ఈ వివాహం ఇష్టం లేదని పేరేంట్స్ కు పుష్ప చెప్పలేదు. పెళ్లిని తప్పించుకొనేందుకు కాబోయే భర్తను చంపాలని ప్లాన్ చేసింది.హైద్రాబాద్ లో ఉద్యోగం చేసే రాము నాయుడు ఈ నెల 15న హైద్రాబాద్ నుండి స్వగ్రామం వచ్చాడు. కాబోయే భార్యతో ఆయన ఫోన్ లో మాట్లాడాడు. ఈ నెల 18 యువతి ఇంటికి వచ్చాడు. తన స్నేహితులకు పరిచయం చేయిస్తానని యువతి రామునాయుడిని సమీపంలోని ఆలయం వద్దకు తీసుకెళ్లింది. మార్గమధ్యలో చాకును కొనుగోలు చేసింది. గుడి వద్ద కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత సర్ ప్రైజ్ ఇస్తానని రాము నాయుడి కళ్లకు గంతలు కట్టి గొంతు కోసింది పుష్ప.

తనకు పెళ్లి ఇష్టం లేదని దైవ భక్తితోనే జీవితం గడుపుతానని పుష్ప పోలీసుల విచారణలో చెప్పింది.ఈ విషయాన్ని పేరేంట్స్ కు చెప్పినా కూడా వినకుండా పెళ్లిని నిశ్చయించారని ఆమె పోలీసులకు చెప్పింది. గతంలో కూడా రెండు సంబంధాలు తప్పిపోవడంతో రాము నాయుడితో తమ కూతురి వివాహం జరిపించాలని పేరేంట్స్ ఆశ పడ్డారు. కానీ పుష్ప రాము నాయుడి గొంతు కోయడంతో పుష్పను పోలీసులు అరెస్ట్ చేశారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య