Andhra Pradesh: ఆ కామాంధుడు ఇక జీవితాంతం జైల్లోనే, గతేడాది 5 ఏళ్ళ బాలుడిపై దారుణంగా అత్యాచారం చేసిన నిందితుడు, దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాలుడి తల్లి
విజయవాడలో గతేడాది బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జీవితకాల జైలుశిక్షతో (Man gets life) పాటు రు.10 వేల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా జడ్జి, పోక్సో కోర్టు జడ్జి డాక్టర్ ఎస్.రజని మంగళవారం తీర్పు చెప్పారు.
Vjy, August 11: విజయవాడలో గతేడాది బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జీవితకాల జైలుశిక్షతో (Man gets life) పాటు రు.10 వేల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా జడ్జి, పోక్సో కోర్టు జడ్జి డాక్టర్ ఎస్.రజని మంగళవారం తీర్పు చెప్పారు. గతేడాది ఘటన వివరాల్లోకెళితే.. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో నివసించే దంపతులకు ఇద్దరు కుమారులు. ఇదేప్రాంతంలో అమరావతి తిరుపతిరావు (32) నివశిస్తున్నాడు. 2021 ఆగస్టు 22న రాఖీ పండుగ రోజు తన ఇద్దరు కుమారులతో కలసి తల్లి తన అన్నయ్య ఇంటికి వెళ్లింది.
ఇక ఐదేళ్ల రెండో కుమారుడు ఆరు బయట ఆడుకుంటుండగా నిందితుడు తిరుపతిరావు ఆ బాలుడికి మాయమాటలుచెప్పి ఎదురుగా నిర్మిస్తున్న ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ( raping minor boy) పాల్పడ్డాడు.అంతే కాకుండా బాలుడి శరీరభాగాల్లో రాళ్లను జొప్పించాడు. కొద్దిసేపటి తర్వాత నోటి నుంచి రక్తం కారుతూ నడవలేని స్థితిలో చేతులతో పాకుతూ వస్తున్న కుమారుడిని చూసిన తల్లి పడిపోయాడని భావించింది.అయితే స్నానం చేయించేందుకు దుస్తులు విప్పగా రక్తం కారుతుండటం గమనించి.. ఏం జరిగిందని ఆరా తీసింది.
బాలుడు జరిగింది చెప్పడంతో వెంటనే బాలుడి తల్లి దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెప్టెంబర్ 29న నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో అమరావతి తిరుపతిరావుకు న్యాయమూర్తి పైన పేర్కొన్న శిక్షను విధిస్తూ.. బాలుడికి రూ.5 లక్షలు వచ్చేటట్లు చూడాలని మండల న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు.