IPL Auction 2025 Live

Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాను వణికిస్తున్న ఎలుగుబంటి, దాడిలో ఒకరు మృతి, మరికొందరి పరిస్థితి విషమం

జిల్లాలోని వజ్రపుకొత్తూరులో ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది. జీడి, కొబ్బరి తోటల్లో పని చేస్తున్న 8 మంది రైతులపై ఎలుగుబటి ఒక్కసారిగా దాడి చేసింది.

Bear

Srikakulam,June 20: ఏపీలో గత కొన్ని రోజులు నుంచి శ్రీకాకుళం జిల్లా వాసులు ( Srikakulam) ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరులో ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది. జీడి, కొబ్బరి తోటల్లో పని చేస్తున్న 8 మంది రైతులపై ఎలుగుబటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా (Man killed in bear attack) మరో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న వజ్రపుకొత్తూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా రెండురోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి ఆదివారం రైతుపై దాడి చేసి గాయపరిచింది. ప్రతిరోజూ లాగే ఉదయం నిద్ర లేచిన కోదండ రావు గ్రామ సమీపంలో ఉన్న తోటకు వెళ్తుండగా సమీప పొదల్లో దాగివున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆయనపై దాడి చేసింది. ఎలుగు దాడితో ప్రాణ భయంతో ఆయన గట్టిగా కేకలు వేశారు. దగ్గర్లో ఉన్నవారు అక్కడికి వచ్చేసరికి ఎలుగు అక్కడ నుండి పారిపోయింది. ఎలుగు దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన మృతి చెందాడు.

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్, చలో అనుమర్లపూడికి అనుమతి లేదని తెలిపిన పోలీసులు, గ్రామంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని స్పష్టం

సోమవారం రోజు స్థానికులు అప్రమత్తతో ఉన్నప్పటికీ మరోసారి దాడి చేసి గ్రామస్తులను గాయపరిచింది. భయంతోనే పొలం పనులకు గుంపులుగా వెళ్లిన గ్రామస్తులపై ఒక్కసారిగా పొదల నుంచి వచ్చిన ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎలుగు బంటి సంచారం నేపథ్యంలో అటవీ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు కాకినాడ జిల్లాను రాయల్ బెంగాల్ టైగర్ గజగజ వణికిస్తోంది. దాదాపు నెల రోజులుగా కాకినాడ జిల్లాల్లో సంచరించిస్తున్నా అటవీ శాఖ అధికారులు పెద్ద పులిని మాత్రం పట్టుకోలేకపోయారు. పైగా తాము చెప్పిన తరువాత వచ్చి అటవీ అధికారులు పులి జాడ గుర్తించామని చెబుతున్నారంటూ జిల్లా వాసులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కావడంతో త్వరగా చికటి పడుతుండగా, ఇంటికి తిరిగి వెళ్లాలంటేనే పులి, ఎలుగు బంటి భయాలతో ఆ జిల్లాల్లో మహిళలు, చిన్నారులతో పాటు పురుషులు సైతం ప్రాణ భయంతో వణికిపోతున్నారు.