AP Shocker: బెడ్ రూంలో మరొకరితో భార్య.. తట్టుకోలేక రోకలిబండతో కొట్టి చంపేసిన భర్త, నీ కూతురుని చంపేశానంటూ మామకు ఫోన్, అనంతపురం జిల్లా కదిరిలో దారుణ ఘటన

భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం (having illicit affair in Kadiri) సాగించడం కళ్లారా చూసిన భర్త.. తన భార్యను రోకలిబండతో తలపై బాది (Man Kills wife) హతమార్చాడు. ఈ దారుణ ఘటన కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో జరిగింది.

Image used for representational purpose only. | File Photo

Kadiri, Nov 19: అనంతపురంలో దారుణ ఘటన చేసుకుంది. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం (having illicit affair in Kadiri) సాగించడం కళ్లారా చూసిన భర్త.. తన భార్యను రోకలిబండతో తలపై బాది (Man Kills wife) హతమార్చాడు. ఈ దారుణ ఘటన కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివశంకర్‌ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి పదేళ్ల క్రితం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె హేమలత (28) అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఏడేళ్ల ఏళ్ల బాలుడు మురళి, ఐదేళ్ల ఏళ్ల బాలిక కీర్తన ఉన్నారు.

పట్నం గ్రామంలో రామాంజినేయులు అనే వ్యక్తితో హేమలత గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ విషయమై పలుమార్లు పద్దతి మార్చుకోవాలని భార్యను భర్త హెచ్చరించడం జరిగింది. అయినా ఆమె ఖాతరు చేయలేదు. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో తన భార్య రామాంజినేయులుతో కలసి ఉండడం కళ్లారా చూసిన శివశంకర్‌కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో పక్కనే ఉన్న రోకలి బండతో ఆమె తలపై బాదాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.ఇది చూసి భయపడిపోయిన రామాంజినేయులు పారిపోయాడు.

ప్రియుడి కోసం వెళ్లిన ప్రియురాలు, తలుపులేసి ఆమెపై కామవాంఛ తీర్చుకున్న మామ, నిందితుడిని అరెస్ట్ చేసిన చిక్కమగళూరు పోలీసులు

ఆ వెంటనే మృతురాలి తండ్రి గోపాలప్పకు ఫోన్ చేసి.. నీ కూతురు అక్రమ సంబంధం పెట్టుకుంది. పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. అందుకే చంపేశానంటూ చెప్పాడు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పట్నం ఎస్సై సాగర్‌ ఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌ తరలించారు.