TTD Key Decisions: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు,వేతనాల పెంపుపై శుభవార్త, ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం, కీలక నిర్ణయాలు ఇవే..

ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త అందించారు. టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు

Bhumana karunakar Reddy (Photo-Video Grab)

Tirumala, Dec 26: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త అందించారు. టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల కోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

శానిటేషన్ ఉద్యోగులు వర్క్ కాంట్రాక్టు ఉద్యోగులు వేతనాలు పెంచాలని నిర్ణయించారు.పోటు కార్మికులకు వేతనాలు 28 వేల నుండి 38 వేలుకు పెంపు, 10 వేలు పెంచాలని నిర్ణయించారు. వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్‌గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో రెండు రోజులు పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.

వచ్చే ఏడాదికి సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 27 సాధారణ సెలవులతో పాటు 25 ఐచ్చిక సెలవులు

కళ్యాణకట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలని నిర్ణయం, తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణం టెండర్లకు ఆమోదం, తిరుపతి పారిశుధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయం. చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల కేటాయించారు. శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

శ్రీవారి ఆలయ పెద్ద జీయార్‌, చిన్న జీయార్‌ మఠాలకు ప్రతీ ఏటా ఇచ్చే ప్యాకేజీకి మరో కోటి రూపాయలు పెంపు. పెద్ద జీయర్‌ మఠానికి రెండు కోట్లు నుండి రెండు కోట్ల 60 లక్షలకు పెంపు. చిన్న జీయర్‌ మఠానికి ఒక కోటి 70లక్షల నుండి 2 కోట్ల 10 లక్షలకు పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.



సంబంధిత వార్తలు

Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

KTR On Rythu Bharosa: మాట తప్పిన బేమాన్ ప్రభుత్వం..రైతు బంధు పథకం లేకుండా చేయాలనే కుట్ర, రైతు భరోసాకు డిక్లరేషన్ సరికాదన్న కేటీఆర్..కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు

JC Prabhakar Reddy On BJP Leaders: థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా..మీ కంటే జగనే మంచోడు, ఏపీ బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు, చేతగాని కొడుకుల్లాగా బస్సులు తగలబెట్టారని ఫైర్

JC Prabhakar Reddy: వీడియో ఇదిగో, మీకన్నా జగనే మేలు కదరా, బస్సు దగ్ధంపై బీజేపీ నేతలపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి