Mekapati Chandrasekhar Reddy: పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎంతో ఆనందంగా ఉంది, కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే

తనపై పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు

Nellore, Mar 24: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందుకు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు వేసింది. తనపై పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. సస్పెన్షన్ వల్ల ఎంతో రిలాక్స్ గా ఫీలవుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎంతో ఆనందంగా ఉన్నానని తెలిపారు. మంచి చేసిన వారికి కూడా కొందరు చెడు చేస్తారని మేకపాటి వ్యాఖ్యానించారు.

వీడియో ఇదిగో, మేకపాటి చంద్రశేఖరరెడ్డిని సస్పెండ్ చేసినందుకు వ్యతిరేక వర్గం సంబరాలు

అనుకున్నది చేసేయడం వైసీపీలో అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్ కు మద్దతు ఇచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారు అని వ్యంగ్యం ప్రదర్శించారు. తన నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారని తెలిపారు. కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తా... ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. పార్టీ అగ్రనేతలకు మానవతా విలువలు అవసరం అని అన్నారు. తాజా పరిణామాలతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల్లో గుసగుసలు మొదలయ్యాయని అన్నారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif