Amma Vodi Scheme: అమ్మఒడి కోతలపై నిజమెంత.. క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్సా సత్యనారాయణ, అటెండెన్స్ ఆధారంగానే అమ్మఒడి ఉంటుందని తెలిపిన మంత్రి, ఈ నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం
ఈ విమర్శలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
Amaravati, June 23: అమ్మఒడి పథకం లబ్ధిదారులను ఏపీ ప్రభుత్వం తగ్గిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విజయనగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స మాట్లాడుతూ.. ఈ నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం (Amma Vodi Scheme) నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా తల్లుల అకౌంట్లలోకి నగదు జమ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) తెలిపారు. గతంలో 32 శాతం మాత్రమే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివేవారన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల సంఖ్య 65 శాతానికి పెరిగిందన్నారు. అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమన్నారు. అటెండెన్స్ ఆధారంగా లబ్ధి చేకూరుతుందన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కు పంపితేనే పథకం వర్తిస్తుందన్నారు. రూ.2 వేలు అనేది పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తాన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అధ్యాపకులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు. ఇంటర్ ఫలితాలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఇంటింటికి కుళాయిలు అన్న కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఇంకో అయిదు ఇలాంటి భారీ ట్యాంకులు జిల్లాలో ఏర్పాటుచేశాం అన్నారు. ఏడువేల ఆరు వందల కేఎల్ నీటిని స్టోర్ చేసి ప్రజలకు అందించాలని నిర్ణయించాం. గత ప్రభుత్వంలో డబ్బులు కట్టించుకుని నీళ్లు ఇవ్వలేకపోయిందని మంత్రి బొత్స విమర్శించారు. బీపీఎల్ కాని వాళ్లైతే అరువేలు కడితే నీటి కుళాయి అందిస్తాం. మా ఎమ్మెల్యేలతో పాటు మా ప్రతినిధులు వార్డులలో పర్యటిస్తున్నారు. నిరంతరాయంగా అందరికీ అందుబాటులో వుంటున్నామన్నారు మంత్రి బొత్స. ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మండిపడ్డారు.