CM-YS-jagan-Review-Meeting

Amaravati, June 22: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జూలై 5వ తేదీ నుంచి (New Date is July 5 ) పునః ప్రారంభంకానున్నాయి. పాఠశాలలను జూలై 4 నుంచి ప్రారంభించాలని (AP Schools Reopening Date) పాఠశాల విద్యాశాఖ ఇంతకు ముందు ఉత్తర్వులు జారీచేసింది. అయితే ప్రధాని మోదీ జూలై 4న రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నారు.

ప్రధాని పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్‌ కూడా పాల్గొంటున్నందున పాఠశాలల పునః ప్రారంభాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. పాఠశాలల ప్రారంభం రోజున జగనన్న విద్యా కానుకను సీఎం విద్యార్థులకు అందించనున్నారని, అందుకను గుణంగా స్కూళ్లను 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు.

ఇక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan) ఈ నెల 27న శ్రీకాకుళం రానున్నారు. అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ (Amma Vodi 3rd Installment) కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే సీఎం చేపట్టనున్నా రు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం–ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 27న సోమవారం ఉదయం 11 గంటల కు శ్రీకాకుళంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి అమ్మ ఒడి లబ్ధిదారులు హాజరు కానున్నారు.

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, bie.ap.gov.in, examresults.ap.nic.in ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

మూడో విడత పంపిణీ కార్యక్రమం ఇక్కడి నుంచే జరుగుతుంది. అంతకుముందు ఆమదాలవలస–శ్రీకాకుళం రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అమ్మ ఒడి లబ్ధిదారులతో మమేకమవుతారు. తిత్లీ, వంశధార ప్రాజెక్టుకు అదనపు పరిహారం పొందుతున్న లబ్ధిదారులతో కూడా కాసేపు ముచ్చటిస్తారు. ఈ సందర్భంగా ఆ లబ్ధిదారులు సీఎంకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు.

రెండు మూడు రోజుల్లో తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు, దాదాపు పది లక్షల మందికిపైగా విద్యార్థులు నిరీక్షణ

అనంతరం నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28న ఫ్రాన్స్‌కు వెళ్తున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో.. గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని సీఎంవో తెలియజేసింది. 28న రాత్రి బయలుదేరనున్న సీఎం జగన్‌.. 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొన్న తర్వాత.. జులై 2న తిరుగు ప్రయాణం అవుతారు.