Three Capitals Row: అసెంబ్లీకి త్వరలో మూడు రాజధానులు బిల్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం. అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పెడతాం. బిల్లు పెట్టిన తర్వాత ఎప్పుడైనా సీఎం విశాఖ రావొచ్చని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.చంద్రబాబు అమరావతికి చేసింది ఏమీలేదని, అమరావతిలో పేదలకు చోటు లేదా? అని ప్రశ్నించారు. అ

MLA Gudivada Amarnath(Photo-Video Grab)

Amaravati, Sep 9: ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం. అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పెడతాం. బిల్లు పెట్టిన తర్వాత ఎప్పుడైనా సీఎం విశాఖ రావొచ్చని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.చంద్రబాబు అమరావతికి చేసింది ఏమీలేదని, అమరావతిలో పేదలకు చోటు లేదా? అని ప్రశ్నించారు.

ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్‌పై సీఎం జగన్ సమీక్ష, సమావేశానికి హాజరైన ఉన్నతాధికారులు

అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు తన ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని మోసం చేశారు. 29 గ్రామాల కోసమే ఉద్యమం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. కొంతమంది పాదయాత్ర అంటున్నారు. అది విశాఖపై దండయాత్ర. పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరు. పాదయాత్రతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చంద్రబాబే కారణం. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తే జనం చూస్తూ ఊరుకోరు’’ అని మంత్రి అన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif