AP Municipal Election Results 2021: ఫ్యాన్ హోరులో కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ-జనసేన, జగన్ సర్కారుకు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లు, విజయవాడ, గుంటూరు, విశాఖ, కర్నూలు, ఇంకా పలు జిల్లాల్లో వైసీపీదే ఆధిక్యం

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ( AP Municipal Election Results 2021) కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అన్ని చోట్ల విజయభేరి మోగించింది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఫ్యాన్‌ దూకుడును అందుకోలేక టీడీపీ, బీజేపీ, జనసేన వెనుకబడిపోయాయి.

AP CM YS Jagan Mohan Reddy (photo-Twitter)

Amaravati, Mar 14: మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ( AP Municipal Election Results 2021) కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అన్ని చోట్ల విజయభేరి మోగించింది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది.

ఫ్యాన్‌ దూకుడును అందుకోలేక టీడీపీ, బీజేపీ, జనసేన వెనుకబడిపోయాయి. ఇప్పటివరకు 8 కార్పొరేషన్లు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు, గుంటూరు కార్పొరేషన్లలో (Andhra Pradesh Municipal Election Results 2021) విజయం సాధించింది. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది.

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ విజయ ఢంకా మోగించింది. మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీ ఘన విజయం సాధించింది.

వి.యవాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించింది. 23 డివిజన్ల లో 19 స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 4 డివిజన్లకు మాత్రమే టీడీపీ పరిమితం కాగా, గ్లాస్‌ బోణి కొట్టలేదు. విజయవాడలో 1, 3, 5, 7, 15, 23, 25, 27, 29, 31, 33, 37, 41, 43, 47, 49, 51, 53, 57 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. 9, 11, 13, 45 డివిజన్లలో టీడీపీ విజయం సాధించింది.

ప్రజలు మూడు రాజధానులకు జై కొట్టారు, ప్రతిపక్షాలకు ఇక పనే లేదు, మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

అనంతపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. హిందూపురం మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 38 వార్డుల్లో 20 వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోగా, నాలుగు వార్డులకే టీడీపీ పరిమితమైంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 40 వార్డుల్లో పది వార్డులు ఏకగ్రీవం కాగా, 30 వార్డుల్లో ఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు.

Here's Andhra Pradesh Municipal Election 2021 Counting

కడప జిల్లా మైదుకూరులో 24 వార్డులు ఉన్నాయి. అందులో 11 వైసీపీ, 12 టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా..1 డివిజన్ జనసేన గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ప్రజాబలంగా చూస్తే టీడీపీ గెలుపు ఖాయం. అయితే ఎక్స్ అఫిషియో ఓట్లు తీసుకుంటే గనుక ఇక్కడ మున్సిపాలిటీ వైసీపీ వశమవుతుంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

గుంటూరులో వైసీపీదే హవా, విజయవాడ కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైసీపీ విజయం, ఒంగోలుతో సహా 5 కార్పోరేషన్లు అధికార పార్టీ కైవసం, తాడిపత్రి ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, ఏపీ మునిసిపల్ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి

కర్నూలు జిల్లాలో ఒక కార్పొరేషన్‌, 7 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. ఈ తొమ్మిదింటిలో ఆరు మున్పిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. అన్నింటిలోనూ వైసీపీ గెలిచింది. వైసీపీ గెలిచినవి: ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు, డోన్. ఇక కర్నూలు కార్పొరేషన్, నంద్యాల మున్సిపాలిటీలలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

జీవీఎంసీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య పోటీ కొనసాగుతోంది. 13 స్థానాల్లో వైసీపీ, 11 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, జనసేన నుంచి ఒకరు లీడ్‌లో కొనసాగుతున్నారు. యలమంచిలి మున్సిపాలిటీలో అయితే పూర్తి ఆధిక్యత వైసీపీకే ఉన్నట్లు సమాచారం. ఇక్కడ 25 స్థానాల్లో వైసీపీ 23, టీడీపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. 28 వార్డులకు గాను వైసీపీ 14 వార్డుల్లో విజయం సాధించింది. టీడీపీ 12, జనసేన 1, ఇండిపెండెంట్ 1 వార్డులో గెలుపొందింది.

దూసుకుపోతున్న వైసీపీ, ప్రతిచోటా ఆధిక్యంలో జగన్ సర్కారు, డోన్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం, కనిగిరి మున్సిపాలిటీలో వైసీపీ క్లీన్ స్వీప్, కొవ్వూరు మునిసిపాలిటీ వైసీపీ ఖాతాలోకి..

ఈనెల 18న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ గిరీషా వెల్లడించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన గిరీషా.. తిరుపతి ఎమ్మెల్యే మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. లలితకల ప్రాంగణంలో ప్రమాణస్వీకారం జరుగనుందని తెలిపారు.ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు 75 మున్సిపాలిటీల్లో ఇప్పటికే వైసీపీ 57 కైవసం చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఎనిమిది కార్పొరేషన్లలో వైసీపీ గెలిచింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైసీపీకి ఘన విజయాన్ని తెచ్చి పెట్టాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రాంతాలను చూడకుండా తాము సంక్షేమ పథకాలను అమలు చేశామని వివరించారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మున్సిపాలిటీ ఫలితాల్లో ప్రజాస్వామ్యం విజయం సాధించిందని, అన్ని నగరాలు, పట్టణాల్లోనూ వైసీసీ క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారరు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోతూ పోతూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపైనే పోరాడామని, జగన్ ఎప్పుడూ చౌకబారు రాజకీయాలు చేయలేదని సజ్జల స్పష్టం చేశారు.