File images of AP CM Jagnmohan Reddy and Opp Leader Chandrababu Naidu | Photo - PTI

Amaravati, Mar 14: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించే దిశగా దూసుకువెళుతోంది. చాలా చోట్ల కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా అధికార పార్టీ ముందుకు వెళుతోంది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ తన హవా కొనసాగిస్తోంది. ఇక ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గుంటూరులోనూ అధికార పార్టీనే ఆధిపత్యం సాధించింది. విజయవాడలో టీడీపీ , వైసీపీ మధ్య పోరు గట్టిగా ఉంది. ఇప్పటివరకు 5 కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు, గుంటూరు కార్పొరేషన్లలో విజయం సాధించింది. విశాఖపట్నం ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మరి కొద్ది గంటల్లో వైజాగ్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

గుంటూరు జిల్లా, రేపల్లె మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్ పూర్తి అయింది. మొత్తం 25 స్థానాల్లో వైసీపీ 22 చోట్ల, రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఓ చోట గెలుపొందారు. అలాగే ముమ్మడివరం మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకుగానూ 11 వైసీపీ, 5 టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. సత్తెనపల్లి మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ 23, టీడీపీ 4, ఇండిపెండెంట్ 2, జనసేన ఒక వార్డులో గెలుపొందింది. మొత్తం మీద గుంటూరు జిల్లాలో రేపల్లె, సత్తెనపల్లి, చిలకలూరి పేట, వినుకొండ మునిసిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది.

Here's Live Updates

గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి మొత్తం 57 డివిజన్లలో ఒకటి గతలం ఏకగ్రీవం అయింది. మిగిలిన 56 డివిజన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా తాజాగా 24 డివిజన్లలో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో వైసీపీ 19 డివిజన్లు గెలుచుకోగా, టీడీపీ 3, జనసేన 1, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలుపొందారు.

దూసుకుపోతున్న వైసీపీ, ప్రతిచోటా ఆధిక్యంలో జగన్ సర్కారు, డోన్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం, కనిగిరి మున్సిపాలిటీలో వైసీపీ క్లీన్ స్వీప్, కొవ్వూరు మునిసిపాలిటీ వైసీపీ ఖాతాలోకి..

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 4 డివిజన్లలో టీడీపీ విజయం సాధించింది. విజయవాడలో 1, 3, 5, 7, 15, 23, 25, 27, 29, 31, 33 , 37, 41, 43, 47, 49, 51, 53, 57 డివిజన్లలో  వైసీపీ విజయం సాధించింది. 9, 11, 13, 45 డివిజన్లలో టీడీపీ విజయం సాధించింది.

ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పోరేషన్ అధికార పార్టీ ఖాతాలోకి వెళ్లింది. మొత్తం 50 డివిజన్లలో వైసీపీ 41 డివిజన్లలో విజయం సాధించగా టీడీపీ 6 డివిజన్లలో జనసేన 1 చోట ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. ఇక మార్కాపురం మునిసిపాలిటీలో 35 వార్డులు ఉండగా 30 వైసీపీ, టీడీపీ 5 గెలుచుకున్నాయి.

చీమకుర్తి నగర పంచాయతీ వైసీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు గాను 18 వార్డులు వైసీపీ, 2 వార్డులు టీడీపీ గెలుపొందింది. అలాగే గిద్దలూరు నగర పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు గాను వైసీపీ 16, టీడీపీ 3, ఇండిపెండెంట్ ఒకటి గెలుపొందింది.

మైదుకూరులో టీడీపీ ముందంజలో ఉంది. మొత్తం 24 వార్డులకు గాను 19 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీడీపీ 1ే చోట్ల వైసీపీ 8 చోట్ల జనసేన ఓ చోట విజయం సాధించాయి. అయిదు వార్డుల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

విశాఖ నగరపాలక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గాజువాక 78వ వార్డులో సీపీఎం అభ్యర్థి గంగారావు విజయం సాధించారు. అనంతపురంలోని హిందూపురంలొ టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 38 వార్డుల్లో 3 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది.

కడప నగరపాలక సంస్థ, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాయచోటి, పులివెందుల మున్సిపాలిటీలు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు నగర పంచాయతీలలో 135 వార్డులలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారంగా కడప నగరపాలక సంస్థను వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే ఏడు మున్సిపాలిటీలలో నాలుగింటిలో అధికార పార్టీ గెలిచింది.

కర్నూలు జిల్లాలో నందికొట్కూరు మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. 29 వార్డులకు గాను వైసీపీ 21, ఇండిపెండెంట్ 7, టీడీపీ ఒక వార్డులో గెలుపొందింది. అలాగే ఎమ్మిగనూరు మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. 32 వార్డులకు గాను వైసీపీ 29, టీడీపీ 3 వార్డుల్లో విజయం సాధించింది. గూడూరు నగర పంచాయతీలో ఓట్ల లెక్కింపు పూర్తైంది. 20 వార్డులకు గాను వైసీపీ 13, ఇండిపెండెంట్ 4, టీడీపీ 2 వార్డుల్లో విజయం సాధించింది.

చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ 24, టీడీపీ 2 వార్డుల్లో విజయం సాధించారు. తిరుపతి కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు కైవసం. పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి మున్సిపాలిటీలు వైఎస్ఆర్‌సీపీ కైవసం

నరసాపురం మున్సిపాలిటిలో కౌంటింగ్ దాదాపు పూర్తయింది. కాకినాడ మున్సిపాలిటిని వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 31 వార్డుల్లో వైసీపీ 22 ఏకగ్రీవం చేసుకుంది. జనసేన నాలుగు, టీడీపీ 1, స్వతంత్ర అభ్యర్థులు రెండు గెలవగా.. వైసీపీ 24 వార్డుల్లో గెలిచింది. జనసేన గెలిచిన ఒక వార్డులోను రీ కౌంటింగ్ చేయాలని ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు రిసెప్షన్ కౌంటింగ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

విశాఖ: నర్సీపట్నం లో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎదురు దెబ్బ తగిలింది. నర్సీపట్నం మున్సిపాలిటీని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 28 వార్డులకు గాను 16 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఇక కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ తొలి రౌండ్ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. 20 వార్డులకు గాను తొలి రౌండ్‌లో ఆరు వార్డును కైవసం చేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లా మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. జిల్లాలో కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం మున్సిపాలిటీలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అభ్యర్థులను మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అభినందించారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం కార్పొరేషన్ లో 17 డివిజన్లకు తొలి రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. 15 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంది. లోకేష్ ప్రచారం నిర్వహించిన 7 వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు.

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాల్టీలన్నింటినీ వైసీపీ కైవసం చేసుకుంది. వెంకటగిరి మొత్తం 25 వార్డులు ఉండగా మూడు ఏకగ్రీవమయ్యాయి. మిగిలినవన్నీ వైసీపీ కైవసం చేసుకుంది. సూళ్లూరుపేట మొత్తం 25 వార్డులు ఉండగా 14 వార్డులు (వైసీపీ) ఏకగ్రీవమవ్వగా.. 11 చోట్ల ఎన్నికలు జరగ్గా 10 స్థానాల్లో వైసీపీ గెలుపొందగా.. టీడీపీ మాత్రం ఒకే ఒక్క చోట గెలిచింది. నాయుడుపేటలో మొత్తం 25 వార్డులుండగా 21 స్థానాలు వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా.. టీడీపీ, బీజేపీ చెరొక్కటి దక్కించుకున్నాయి. ఎన్నికలు జరిగిన 2 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. మరోవైపు.. ఆత్మకూరు మొత్తం 23 వార్డులుండగా.. 6 చోట్ల (వైసీపీ) ఏకగ్రీవాలయ్యాయి. 17 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా 10 వార్డుల్లో వైసీపీ, ఒకే ఒక్క వార్డులో టీడీపీ, రెండు వార్డుల్లో ఇతరులు గెలిచారు. అయితే.. ఆత్మకూరులో నాలుగు వార్డుల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.

తూర్పుగోదావరి: గొల్లప్రోలు నగర పంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 12చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు

శ్రీకాకుళం: పాలకొండ నగర పంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది. ఇప్పటి వరకు 50 మున్సిపాలిటీలు వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.

పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 29 వార్డులకు ఇప్పటి వరకు 25 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు సాధించింది. విజయనగరం: బొబ్బిలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 8 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉంటే 2వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 34 చోట్ల ఎన్నికలు జరిగాయి. రాయదుర్గంలోనూ 32 వార్డులు ఉన్నాయి. అన్ని చోట్ల పోలింగ్ జరిగింది. ఇక తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగితుంది. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వెంటనే పోలీసులు.. స్పాట్‌కు చేరుకున్నారు.