New Revenue Divisions in AP: కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు, రాష్ట్రంలో 63 కి చేరుకోనున్న మొత్తం రెవిన్యూ డివిజన్ల సంఖ్య, రెవిన్యూ విడిజన్లపై పూర్తి సమాచారం ఇదే

ఏపీలో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు (Andhra Pradesh New Districts) ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం నిన్న ప్రతి జిల్లాకు వేర్వేరుగా ముసాయిదా ప్రకటన జారీ చేసింది. 26 జిల్లాలకు సంబంధించి వరుసగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది.

CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Amaravati, Jan 27: ఏపీలో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు (Andhra Pradesh New Districts) ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం నిన్న ప్రతి జిల్లాకు వేర్వేరుగా ముసాయిదా ప్రకటన జారీ చేసింది. 26 జిల్లాలకు సంబంధించి వరుసగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది.ఈ ప్రతిపాదనలపై స్థానికులకు ఏవైనా అభ్యంతరాలుంటే నెల రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాలని ప్రభుత్వం పేర్కొంది.

ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రెవెన్యూ డివిజన్ల స్వరూపం (New Revenue Divisions in AP) కూడా మారనుంది. కొత్తగా ఏర్పడే జిల్లాల ద్వారా కొత్తగా మరో 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 51 రెవెన్యూ డివిజన్లలోనూ పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్తగా ఏర్పడబోయే డివిజన్లతో రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 63కి చేరుకోనుంది. కొత్తగా ఏర్పడబోయే రెవిన్యూ డివిజన్ల విషయానికి వస్తే.. రాయచోటి, బాపట్ల, చీరాల, పలమనేరు , డోన్‌, ఆత్మకూరు, నందిగామ, తిరువూరు, పుట్టపర్తి, బొబ్బిలి , భీమునిపట్నం, భీమవరం ఏర్పాటు కానున్నాయి. అలాగే పాత డివిజన్లలలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.

కొత్త రెవెన్యూ డివిజన్లు ఇవే..

రాయచోటి: వైఎస్సార్‌ జిల్లాలోని రాయచోటి, సాంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలు, మదనపల్లి డివిజన్‌లోని పీలేరు, గుర్రంకొండ, కలకడ, కేవీ పల్లె మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు.

బాపట్ల: తెనాలి డివిజన్‌లోని వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటు కానుంది.

చీరాల: ఒంగోలు డివిజన్‌లోని చీరాల, వేటపాలెం, అద్దంకి, జె.పంగులూరు, సంతమాగులూరు, బల్లికురువ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టేరు మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటవనుంది.

పలమనేరు: మదనపల్లి డివిజన్‌లోని పలమనేరు, గంగవరం, బాలిరెడ్డిపల్లె, వి.కోట, పెద్దపంజని, కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం, రొంపిచర్ల, సోమల, చౌడిపల్లి, పుంగనూరు, సొదం మండలాలు, తిరుపతి డివిజన్‌లోని పులిచెర్ల మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటుకానుంది.

డోన్‌: కర్నూలు డివిజన్‌లోని డోన్, బేతంచర్ల, పీపల్లె, నంద్యాల డివిజన్‌లోని బనగానపల్లి, అవుకు, కొల్లకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు.

ఏపీలో కొత్త జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు, మెమొరాండానికి, గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి స్వల్ప తేడాలు

ఆత్మకూరు: నంద్యాల డివిజన్‌లోని బండి ఆత్మకూరు, కర్నూలు డివిజన్‌లోని శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జె.బంగ్లా, కొత్తపల్లె, పాములపాడు, మిడుతూరు మండలాలు ఈ డివిజన్‌లోకి రానున్నాయి.

నందిగామ: విజయవాడ డివిజన్‌లోని నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు.

తిరువూరు: విజయవాడ డివిజన్‌లోని మైలవరం, జి.కొండూరు, నూజివీడు డివిజన్‌లోని రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటు కానుంది.

పుట్టపర్తి: కదిరి డివిజన్‌లోని కదిరి, తలుపుల, నంబులిపులికుంట, గండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, పుట్టపర్తి, నల్లమడ, బుక్కపట్నం, కొత్త చెరువు, ఓడి చెరువు, అమడగుర్‌ మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు.

ఏపీలో 26 జిల్లాల పూర్తి సమాచారం, ఏ నియోజకవర్గం ఏ జిల్లాకు వెళుతోంది, ముఖ్య కేంద్రంగా ఏదీ ఉండబోతోంది, ఏపీలో కొత్త జిల్లాలపై సమగ్ర కథనం

బొబ్బిలి: విజయనగరం డివిజన్‌లోని గజపతినగరం, దత్తిరాజేరు, మెరకముడిదం, పాలకొండ డివిజన్‌లోని రాజాం, వంగర, రేగిడి ఆముదాలవలస, సంతకవిటి, పార్వతీపురం డివిజన్‌లోని బొబ్బిలి, రామభద్రాపురం, బాదంగి, తెర్లాం మండలాలు ఈ డివిజన్‌లోకి రానున్నాయి.

భీమునిపట్నం: విశాఖ డివిజన్‌లోని భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్, మహరాణిపేట మండలాలను ఈ డివిజన్‌లో ప్రతిపాదించారు.

భీమవరం : కొవ్వూరు డివిజన్‌లోని తణుకు, అత్తిలి, ఇరగవరం, నరసాపురం డివిజన్‌లోని భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు, ఏలూరు డివిజన్‌లోని తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలు ఈ డివిజన్‌లో కలవనున్నాయి.

పాత రెవెన్యూ డివిజన్లు మార్పులు ఇవే..

అనకాపల్లి : మొత్తం 15 మండలాలతో అనకాపల్లి డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో గతంలో అనకాపల్లిలో డివిజన్‌లో ఉన్న 12 మండలాలు మాడుగుల, చీడిక, దేవరపల్లె, కె.కోటపాడు, అనకాపల్లి, కసింకోట, యలమంచిలి, రా>ంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, బుచ్చయ్యపేట, చోడవరంతోపాటు గతంలో విశాఖ డివిజన్‌లో ఉన్న పెందుర్తి, పరవాడ, సబ్బవరం మండలాలు చేరనున్నాయి.

నర్సీపట్నం: 10 మండలాలతో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుంది. నర్సీపట్నం, గోలుగొండ, మాకవరపాలెం, నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, రావికమతం, రోలుగుంట, కోటారుట్ల మండలాలు ఈ డివిజన్‌ పరిధిలోకి వస్తాయి.

కల్యాణదుర్గం: మొత్తం 12 మండలాలు. ఇందులో కొత్తగా ధర్మవరం డివిజన్‌కు చెందిన రామగిరి మండలాన్ని కల్యాణదుర్గం డివిజన్‌లో చేర్చారు. రాయదుర్గం, డి.హిరేహళ్, కనేకల్, బొమ్మనహళ్, గుమ్మగట్ట, కల్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, సెట్టూర్, కుందర్‌పల్, కంబదూర్, బెలుగప్ప, రామగిరి మండలాలు ఈ డివిజన్‌ పరిధిలోకి రానున్నాయి.

అనంతపురం: మొత్తం 14 మండలాలు. ఇందులో కొత్తగా ధర్మవరం డివిజన్‌ నుంచి మూడు మండలాలు చేరనున్నాయి. అనంతపురం, తాడిపత్రి, కూడేరు, ఆత్మకూరు, పెద్దపప్పూరు, శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, యెల్లనూరు, నారపాల, బి.కె.సముద్రంతో పాటు ధర్మవరం డివిజన్‌ నుంచి కంగనపల్లి, చెన్నే కొత్తపల్లి, రాప్తాడు మండలాలు దీని పరిధిలోకి రానున్నాయి.

గుంతకల్లు: మొత్తం 8 మండలాలు. గతంలో ఈ మండలాలు అనంతపురం డివిజన్‌లో ఉండేవి. తాజాగా ఉరవకొండ, విదపకల్లు, వజ్రకరూర్, గుంతకల్లు, గుత్తి, పమిడి, యాడికి, పెద్దవడుగు మండలాలతో డివిజన్‌ ఏర్పాటు కానుంది.

మదనపల్లి: ఈ డివిజన్‌ 11 మండలాలకు పరిమితం కానుంది. మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం, తంబళపల్లి, ములకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాయల్పాడు మండలాలు ఈ డివిజన్‌లో ఉంటాయి.

రాజంపేట: మొత్తం 11 మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటవుతోంది. ఇందులో కడప డివిజన్‌ నుంచి రెండు మండలాలు వచ్చి చేరనున్నాయి. కోడూరు, పెనగలూరు, చిట్వేలి, పుల్లంపేట, ఓబుళవారిపల్లె, రాజంపేట, సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరుతో పాటు కడప డివిజన్‌ నుంచి వీరబల్లె, టి.సుండుపల్లె మండలాలు చేరతాయి.

గూడూరు: మొత్తం 11 మండలాలు. ఇందులో ఆత్మకూరు, నెల్లూరు డివిజన్ల నుంచి ఒక్కొక్కటి చొప్పున చేరనున్నాయి. గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడ, చిట్టమూరు, వెంకటగిరి, సైదాపురం, డక్కిలి, బాలాయపల్లె, ఆత్మకూరు డివిజన్‌ నుంచి కలువాయి, నెల్లూరు డివిజన్‌ నుంచి రాపూరు మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటు కానుంది.

తిరుపతి: చిత్తూరు నుంచి రెండు, మదనపల్లి నుంచి రెండు మండలాలతో కలిపి మొత్తం 11 మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటు కానుంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, పిచ్చాటూరు, నాగలాపురం, పాకాల, చంద్రగిరి, చిత్తూరు డివిజన్‌ నుంచి నారాయణవనం, రామచంద్రాపురం, మదనపల్లి డివిజన్‌ నుంచి ఎర్రవారిపాలెం, చినగొట్టిగల్లు మండలాలు ఇందులో ఉంటాయి.

నాయుడుపేట: మొత్తం 13 మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటవుతోంది. సూళ్లూరుపేట, ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, తడతో పాటు తిరుపతి డివిజన్‌ నుంచి శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీపురం, సత్యవేడు, బీఎన్‌ ఖండ్రిగ, వరదయ్యపాలెం మండలాలు ఇందులో ఉంటాయి.

చిత్తూరు

ఈ డివిజన్‌లో 18 మండలాలు ఉంటాయి. చిత్తూరు, గుడిపాల, యాదమర్రి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనుమర్, బంగారుపాలెం, తవనంపల్లె, ఇర్లా, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, వడమాలపేట, పాలసముద్రం, పుత్తూరు, కార్వేటినగర్, నగరి, నిండ్ర, విజయాపురం మండలాలు ఇందులో ఉంటాయి.

రాజమహేంద్రవరం

మొత్తం 10 మండలాలతో ఏర్పాటు కానున్న ఈ డివిజన్‌లో రాజమహేంద్రవరం అర్బన్, రాజమహేంద్రవరం గ్రామీణ, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి, రంగంపేటతోపాటు రామచంద్రాపురం డివిజన్‌ నుంచి అనపర్తి, బిక్కవోలు, కాకినాడ నుంచి పెదపూడి, పెద్దాపురం డివిజన్‌ నుంచి రంగంపేట మండలాలతో ఇది ఏర్పాటు కానుంది.

కొవ్వూరు

మొత్తం 10 మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటు కానుంది. కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లితో పాటు ఏలూరు డివిజన్‌ నుంచి ద్వారకాతిరుమల, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం డివిజన్‌ నుంచి గోపాలపురం మండలం ఈ డివిజన్‌ పరిధిలోకి వెళతాయి.

ఏలూరు

మొత్తం 12 మండలాలు. ఏలూరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరంతో పాటు కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్‌కు చెందిన కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

నూజివీడు

6 మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటు కానుంది. నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరుతోపాటు ఏలూరు డివిజన్‌కు చెందిన చింతలపూడి, లింగంపాలెం మండలాలు దీని పరిధిలో ఉంటాయి.

జంగారెడ్డిగూడెం

9 మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటు కానుంది. ఏలూరు డివిజన్‌కు చెందిన కామవరపుకోట, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం డివిజన్‌ నుంచి జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమల్లి, కొయ్యలగూడెం, కుక్కునూరు డివిజన్‌ నుంచి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటవుతుంది.

గుంటూరు

ఈ డివిజన్‌లో 10 మండలాలు ఉంటాయి. తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని మండలాలు ఈ డివిజన్‌ పరిధిలోకి వస్తాయి.

తెనాలి

8 మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటు కానుంది. తెనాలి డివిజన్‌ నుంచి తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, కాకుమాను, గుంటూరు డివిజన్‌ నుంచి మంగళగిరి, తాడేపల్లి మండలాలు ఇందులో ఉంటాయి.

పెద్దాపురం

పెద్దాపురం డివిజన్‌ 12 మండలాలతో ఉంది. ఇప్పటికే ఉన్న పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, తుని, తొండంగి, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి మండలాలతో పాటు రాజమండ్రి డివిజన్‌ నుంచి గోకవరం మండలం చేరనుంది.

కాకినాడ

ఈ డివిజన్‌లో మొత్తం ఏడు మండలాలు ఉంటాయి. అందులో సామర్ల్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, కరప, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్‌ మండలాలు ఇందులో ఉంటాయి.

అమలాపురం

ఈ డివిజన్‌ మొత్తం 16 మండలాలతో ఉంది. ఇందులో ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాలు ఇందులో ఉంటాయి.

రామచంద్రాపురం

ఈ డివిజిన్‌ 8 మండలాలతో ఉంటుంది. రామచంద్రాపురం డివిజన్‌లోని రామచంద్రాపురం, కాజులూరు, పామర్రు (కె.గంగవరం), మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలతో పాటు కాకినాడ డివిజన్‌ నుంచి తాళ్లరేవు, రాజమండ్రి డివిజన్‌ నుంచి ఆలమూరు మండలాలు ఇందులోకి వస్తాయి.

మచిలీపట్నం

ఇది 12 మండలాలతో ఉంది. ఇందులో పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, ఘంటసాల, మొవ్వ మండలాలు ఈ డివిజన్‌ పరిధిలో ఉంటాయి.

గుడివాడ

ఈ డివిజన్‌లో మొత్తం 13 మండలాలు ఉంటాయి. గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు మండలాలతో పాటు, విజయవాడ డివిజన్‌ పరిధిలోని పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, నూజివీడు డివిజన్‌లోని ఉయ్యూరు, పమిడిముక్కల, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

కర్నూలు

ఈ డివిజన్‌ మొత్తం 11 మండలాలతో ఉంటుంది. ప్రస్తుత కర్నూలు డివిజన్‌లోని కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్, గూడూరు, కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, కోడుమూరు, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలతో పాటు నంద్యాల డివిజన్‌లోని పాణ్యం, గడివేముల మండలాలు దీని పరిధిలో ఉంటాయి.

ఆదోని

ఈ డివిజన్‌లో 17 మండలాలు ఉంటాయి. ప్రస్తుత ఆదోని డివిజన్‌లోని ఆదోని, మంత్రాలయం, పెదకడుబూరు, కోసిగి, కౌతాలం, ఆలూరు, దేవనకొవడ, హోలగుండ, హలహర్వి, ఆస్పిరి, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

పాలకొండ

ఇందులో శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్‌లోని పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాలు, విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌లోని జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలు దీని పరిధిలో ఉంటాయి.

పార్వతీపురం

మొత్తం 10 మండలాలతో ఉంటుంది. ఇందులో ప్రస్తుత పార్వతీపురం డివిజన్‌లోని పార్వతీపురం, సీతానగరం, బలిజపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలు, విజయనగరం డివిజన్‌లోని మెంటాడ దీని పరిధిలోకి వస్తాయి.

నంద్యాల

ఈ డివిజన్‌లో 9 మండలాలు ఉంటాయి. ప్రస్తుత నంద్యాల డివిజన్‌లోని నంద్యాల, గోస్పాడు, సిర్వేల్, డోర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ మండలాలతో ఈ డివిజన్‌ యథాతథంగా ఉంటుంది.

నెల్లూరు

నెల్లూరు డివిజన్‌ 12 మండలాలతో ఏర్పాటు కానుంది. ఇందులో నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్, కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

కావలి

ఈ డివిజన్‌లో 12 మండలాలు ఉంటాయి. ప్రస్తుత కావలి డివిజన్‌లోని కావలి, బోగోలు, ఆలూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, కొండాపురం మండలాలతో పాటు ప్రస్తుత కందుకూరు డివిజన్‌లోని కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

ఆత్మకూరు

ఆత్మకూరు డివిజన్‌ 11 మండలాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత ఆత్మకూరు డివిజన్‌లో ఉన్న ఆత్మకూరు, చేజెర్ల, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, వింజమూరు మండలాలతో పాటు ప్రస్తుత కావలి డివిజన్‌లోని వరికుంటపాడు, దత్తులూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

విజయవాడ

విజయవాడ డివిజన్‌ 6 మండలాలతో ఏర్పాటు కానుంది. విజయవాడ ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్, రూరల్‌ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం మండలం దీని పరిధిలోకి రానుంది.

పాడేరు

పాడేరు డివిజన్‌ 11 మండలాలతో ఏర్పాటు కానుంది. ఈ డివిజన్‌లో అరకు వ్యాలీ, పెదబయలు, డుంబ్రిగుడ, ముంచింగిపుట్టు, హుకుంపేట, అనంతగిరి, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

రంపచోడవరం

రంపచోడవరం డివిజన్‌ 11 మండలాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత రంపచోడవరం డివిజన్‌ పరిధిలోని రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలతో పాటు ప్రస్తుత ఎటపాక డివిజన్‌ పరిధిలో గల ఎటపాక, కూనవరం, వరరామచంద్రపురం మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

గురజాల

గురజాల డివిజన్‌ 14 మండలాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత గురజాల డివిజన్‌ పరిధిలోని గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాలతో పాటు ప్రస్తుత గుంటూరు డివిజన్‌ పరిధిలోని పెదకూరపాడు, బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

నరసరావుపేట

నరసరావుపేట డివిజన్‌ 14 మండలాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత నరసరావుపేట డివిజన్‌ పరిధిలోని నకిరికల్లు, చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు, నరసరావుపేట, రొంపిచెర్ల, వినుకొండ, బోళ్లపల్లె, నూజెండ్ల, శావల్యాపురం, ఐపూరు మండలాలతో పాటు ప్రస్తుత గుంటూరు డివిజన్‌ పరిధిలోని సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల మండలాలు దీని పరిధిలోకి రానున్నాయి.

ఒంగోలు

ఒంగోలు డివిజన్‌ 12 మండలాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత ఒంగోలు డివిజన్‌లోని ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పాలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు మండలాలతో పాటు ప్రస్తుత కందుకూరు డివిజన్‌ పరిధిలోని మర్రిపూడి, కొండెపి, జరుగుమల్లి, పొన్నలూరు, సింగరాయకొండ మండలాలు ఈ డివిజన్‌ పరిధిలోకి వస్తాయి.

మార్కాపురం

మార్కాపురం డివిజన్‌ 13 మండలాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత మార్కాపురం డివిజన్‌ పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, రేచర్ల, కొమరోలు, కుంబం, ఆర్దవీడు, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, డోర్నాల, పెద్దారవీడు మండలాలతో పాటు ప్రస్తుత కందుకూరు డివిజన్‌లోని తుర్లపాడు దీని పరిధిలోకి రానుంది.

కడప

ఈ డివిజన్‌లో 10 మండలాలు ఉంటాయి. కడప, చక్రాయపేట, యర్రగుంట్ల, వీరాపునాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూర్, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి మండలాలు, ప్రస్తుత జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లోని వేంపల్లి మండలం దీని పరిధిలోకి చేరతాయి.

జమ్మలమడుగు: దీని పరిధిలో 12 మండలాలు ఉంటాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం దీని పరిధిలోకి వస్తాయి.

బద్వేలు: ఈ డివిజన్‌ పరిధిలో 12 మండలాలు ఉంటాయి. ప్రస్తుత జమ్మలమడుగు డివిజన్‌లోని ఎస్‌.మైదుకూరు, దువ్వూరు, చాపాడు మండలాలు, ప్రస్తుత రాజంపేట డివిజన్‌లోని ఎస్‌వీ కాశీనాయన, కలాసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, గోపవరం, బ్రహ్మంగారిమఠం, అట్లూరు, ప్రస్తుత కడప డివిజన్‌లోని ఖాజీపేట ఈ డివిజన్‌ పరిధిలో చేరనున్నాయి.

నరసాపురం: దీని పరిధిలో 8 మండలాలు ఉంటాయి. నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి, పోడూరు, అచంట.. ప్రస్తుత కొవ్వూరు డివిజన్‌ నుంచి పెనుగొండ, పెనుమంట్ర మండలాలు దీని పరిధిలో చేరతాయి.

విశాఖపట్నం: ఈ డివిజన్‌ పరిధిలో 5 మండలాలు ఉంటాయి. గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, ములగాడ, సీతమ్మధార మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

విజయనగరం: ఈ డివిజన్‌ పరిధిలో 15 మండలాలు ఉంటాయి. విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, శృంగవరపుకోట, జామి, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొండపల్లి, గరివిడి, గుర్ల మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

టెక్కలి: దీని పరిధిలో 14 మండలాలు ఉంటాయి. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, జలుమూరు, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం, ప్రస్తుత పాలకొండ డివిజన్‌ పరిధిలోని పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు దీని కిందకు వస్తాయి.

శ్రీకాకుళం: 16 మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటవుతుంది. శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, నరసన్నపేట, పోలాకి, ఎల్‌ఎన్‌ పేట, ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, రణస్థలం, ప్రస్తుత పాలకొండ డివిజన్‌లోని సారవకోట, హిరమండలం, కొత్తూరు మండలాలు దీని పరిధిలో చేరతాయి.

ధర్మవరం: ఈ డివిజన్‌ 4 మండలాలతో ఏర్పాటు కానుంది. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

పెనుకొండ: దీని పరిధిలో 13 మండలాలు ఉంటాయి. పెనుకొండ, పరిగి, గోరంట్ల, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగిళి మండలాలు దీని పరిధిలో ఉంటాయి.

కుక్కునూరు: పోలవరం విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుతో కలిపి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటవుతుంది.

ఎటపాక: విలీన మండలాలైన కూనవరం, వీఆర్‌ పురం, చింతూరు, ఎటపాక మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటవుతుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement