Andhra Pradesh: మొదటి రాత్రికి భయపడి ఆత్మహత్య చేసుకున్న కొత్త పెళ్లి కొడుకు, స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ ఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసిన తల్లి
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తెనాలిలో కొత్తగా పెళ్లైన వరుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన (Newlywed Man commits suicide) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
Amaravati, April 20: ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తెనాలిలో కొత్తగా పెళ్లైన వరుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన (Newlywed Man commits suicide) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచర్ల సాగర్ రింగ్‌రోడ్‌కు చెందిన సత్యనారాయణరాజు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు పత్తిగుడుపు కిరణ్‌కుమార్ (32)కు ఈ నెల 11వ తేదీ తెనాలి వించిపేటకు చెందిన యువతితో వించిపేటలో వివాహం జరిగింది.
మరుసటి రోజు 12వ తేదీ భార్యను తీసుకుని వరుడు (Newlywed Man) మాచర్ల వెళ్లాడు. అత్తింటివారు16వ తేదీ మొదటి రాత్రి శోభనానికి ఏర్పాట్లు చేశారు. దీంతో తెనాలి వచ్చేందుకు బయలుదేరిన కిరణ్‌కుమార్ గుంటూరు బస్టాండ్‌లో నాలుగు గంటల సమయంలో దిగగానే ఇప్పుడే వస్తానని చెప్పి (five days after marriage in Guntur) వెళ్లిపోయాడు. రాత్రి అయినా అతను రాకపోవడంతో అతని సెల్‌ఫోన్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్‌లో ఉండటంతో కిరణ్‌కుమార్ బంధువులకు సమాచారం అందించారు. అనంతరం వారు తెనాలి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా కృష్ణానది ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉందని తాడేపల్లి పోలీసులకు సమాచారం అందడంతో బయటకు తీసి పరిశీలించారు. పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది.
మృతుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌లో సిమ్‌ను తీసి పరిశీలించి బంధువులకు సమాచారం ఇవ్వగా తల్లి విజయలక్ష్మి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన కుమారుడేనని గుర్తించింది. ఫస్ట్‌నైట్ అంటే భయపడ్డాడని, వారి స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడి కట్టుకున్న భార్యను, మమ్మల్ని అన్యాయం చేశాడని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)