పంజాబ్‌లోని లూథియానాలో (Ludhiana ) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున లూథియానాలోని టిబ్బా రోడ్డులోని మున్సిపల్ చెత్త డంప్‌యార్డ్ సమీపంలో ఉన్న ఓ గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు సహా ఐదుగురు చిన్నారులు తమ గుడిసెలో నిద్రిస్తుండగా అగ్నిప్రమాదం జరిగిందని లూథియానా అసిస్టెంట్ కమిషనర్ (ఈస్ట్) సురీందర్ సింగ్ తెలిపారు. టిబ్బా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రణబీర్ సింగ్ సంఘటన స్థలానికి వచ్చారు. వారంతా ఉపాధి కోసం లూథియానకు వలస కార్మికులని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, మృతులను గుర్తించాల్సి ఉన్నదన్నారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Punjab: 7 of Family Charred to Death As Hut Catches Fire in Ludhianahttps://t.co/yWLHJPjFyH#Punjab #Fire #Hut #Ludhiana
— LatestLY (@latestly) April 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)